10, సెప్టెంబర్ 2023, ఆదివారం

చెవిపోగు పోయింది చిన్నవాడా | Chievipogu poyindi chinnavada | Song Lyrics | Attavarillu (1970)

చెవిపోగు పోయింది చిన్నవాడా



చిత్రం :  అత్తవారిల్లు (1970)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


చెవిపోగు పోయింది చిన్నవాడా..

యాడ చిక్కుకుందో చెప్పవోయ్ చక్కనోడా

యాడ చిక్కుకుందో చెప్పవోయ్ చక్కనోడా


కాకెత్తుపోయిందో?.. ఏ చిలకెత్తుకుపోయిందో...

కాకెత్తుపోయిందో.. చిలకెత్తుకుపోయిందో...

నాకేం ఎరుకా.. అది నీకే ఎరుక


చెవిపోగు పోయింది చిన్నవాడా..

యాడ చిక్కుకుందో చెప్పవోయ్ చక్కనోడా 


చరణం 1 :


గది దాటి రమ్మన్నావు... 

పూల పొదలోకి పదమన్నావు

బుగ్గ మీద చిటికేశావు.. 

నేను సిగ్గు పడితె నవ్వేశావు

ఏ మంత్రం వేశావో?... ఏ మాయ చేశావో?...

ఏ మంత్రం వేశావో... ఏ మాయ చేశావో...

ఇంతలో... చూసుకుంటే... ఏదీ... ఎక్కడా?


చెవిపోగు పోయింది చిన్నవాడా..

యాడ చిక్కుకుందో చెప్పవోయ్ చక్కనోడా 



చరణం 2 :


తాకితే.. ఉలికి పడితివి

గాలి సోకితే.. ఎగిరి పడితివి

మబ్బుల్లో.. మెరిసిపోతివి..

ఏదో మైకంలో.. మురిసి పోతివి...


నా చూపు ఓయమ్మీ.. నీ చుట్టూ తిరుగుతుంటే...

నా చూపు ఓయమ్మీ.. నీ చుట్టూ తిరుగుతుంటే...

నీ పచ్చని అందానికి.. నేను కాపలా ఉంటే...

పోగెట్టా... అది ఎట్టా..

పోగెట్టా పోతుందే చిన్నదానా.. 

ఆ పొదరింట చూడవే ఇప్పుడైనా


హ...

చెవిపోగు పోలేదు చిన్నవాడా..

అది చిక్కుకుంది నీ గుండెకు చక్కనోడా...

అది చిక్కుకుంది నీ గుండెకు చక్కనోడా...


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి