15, నవంబర్ 2025, శనివారం

ఒకసారి కలలోకి రావయ్యా | Okasari Kalaloki Ravayya | Song Lyrics | Gopaludu Bhupaludu (1967)

ఒకసారి కలలోకి రావయ్యా



చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)

సంగీతం: కోదండపాణి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, ఎస్. జానకి


పల్లవి:


ఒకసారి కలలోకి రావయ్యా

ఒకసారి కలలోకి రావయ్యా

నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా


ఒకసారి రాగానే ఏమౌనులే ..

నీ హృదయాన శయనించి ఉంటానులే ..

ఏలుకుంటానులే …

ఒకసారి రాగానే ఏమౌనులే...

ఓ గొల్ల గోపయ్యా …


చరణం 1:


పగడాల నా మోవి చిగురించెరా ..

మోము చెమరించెరా .. 

మేను పులకించెరా

సొగసు వేణువు చేసి పలికించరా

సొగసు వేణువు చేసి పలికించరా


కెమ్మోవి పై తేనె ఒలికించనా …

కెమ్మోవి పై తేనె ఒలికించనా

తనివి కలిగించనా .. మనసు కరిగించనా

కేరింతలాడించి సోలించనా … 

కేరింతలాడించి సోలించనా...

ఒకసారి కలలోకి రావయ్యా.. ఆ.. ఆ..


చరణం 2:


ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే

వగలు కురిపించవే.. మేను మరపించవే

మరపులో మధుకీల రగిలించవే..

మరపులో మధుకీల రగిలించవే


చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా.. ఆ..

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా

మొగ్గ తొడిగిందిరా.. మురిసి విరిసిందిరా

పదును తేలిన వలపు పండించరా

పదును తేలిన వలపు పండించరా


ఒకసారి కలలోకి రావయ్యా

నా మువ్విళ్ళు కవ్వించి పోవయ్యా.. 

ఓ గొల్ల గోపయ్యా

ఒకసారి రాగానే ఏమౌనులే..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి