15, నవంబర్ 2025, శనివారం

కోటలోని మొనగాడా | Kotalona Monagada | Song Lyrics | Gopaludu Bhupaludu (1967)

కోటలోని మొనగాడా



చిత్రం: గోపాలుడు భూపాలుడు (1967)

సంగీతం: ఎస్.పి. కోదండపాణి

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, పి. సుశీల


పల్లవి:


కోటలోని మొనగాడా.. 

కోటలోని మొనగాడా

వేటకు వచ్చావా.. 

వేటకు వచ్చావా

జింకపిల్ల కోసమో.. 

ఇంక దేనికోసమో

జింకపిల్ల కోసమో ..

ఇంక దేనికోసమో


తోటలోని చినదానా.. 

తోటలోని చినదానా

వేటకు వచ్చానే ..

వేటకు వచ్చానే

జింకపిల్ల కన్నులున్న.. 

చిన్నదాని కోసమే

జింకపిల్ల కన్నులున్న.. 

చిన్నదాని కోసమే


చరణం 1:


ఎలాటి పిల్ల అది.. 

ఏపాటి అందమది

ఎలాటి పిల్ల అది.. 

ఏపాటి అందమది

ఏ వూరు చిన్నది.. 

ఏ కోన వున్నది

ఏ వూరు చిన్నది.. 

ఏ కోన వున్నది


చారడు కన్నులది.. 

చామంతి వన్నెలది

చారడు కన్నులది.. 

చామంతి వన్నెలది

ఏ వూరు ఏమో.. 

నా ఎదురుగనే ఉన్నది ..

ఏ వూరు ఏమో....

నా ఎదురుగనే ఉన్నది !


కోటలోని మొనగాడా.. 

కోటలోని మొనగాడా

వేటకు వచ్చావా.. 

వేటకు వచ్చావా

జింకపిల్ల కోసమో.. 

ఇంక దేనికోసమో

జింకపిల్ల కోసమో ..

ఇంక దేనికోసమో


చరణం 2:


కత్తుల వీరునికి.. 

కన్నె మనసేందుకో

జిత్తుల సిపాయికి ..

చెలి వలపెందుకో

కత్తుల వీరునికి.. 

కన్నె మనసేందుకో

జిత్తుల సిపాయికి ..

చెలి వలపెందుకో


కత్తులు ఒకచేత.. 

గుత్తులు ఒకచేత

కత్తులు ఒకచేత.. 

గుత్తులు ఒకచేత

నిలిపే బంటునే ..

నీకు తగిన జంటనే .. 

నీకు తగిన జంటనే !


కోటలోని మొనగాడా.. 

కోటలోని మొనగాడా

వేటకు వచ్చావా.. 

వేటకు వచ్చావా

జింకపిల్ల కోసమో.. 

ఇంక దేనికోసమో

జింకపిల్ల కోసమో ..

ఇంక దేనికోసమో


తోటలోని చినదానా.. 

తోటలోని చినదానా

వేటకు వచ్చానే ..

వేటకు వచ్చానే

జింకపిల్ల కన్నులున్న.. 

చిన్నదాని కోసమే

జింకపిల్ల కన్నులున్న.. 

చిన్నదాని కోసమే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి