10, నవంబర్ 2025, సోమవారం

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా | Ninna Monna Reku Vippina | Song Lyrics | Badi Panthulu (1972)

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా


చిత్రం: బడి పంతులు (1972)

సంగీతం:  కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల, పి సుశీల


పల్లవి:


నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

    

చరణం 1:


పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు

నీ పైట కొంగు చాటున దోబూచులాడెను 


పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు

నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు 


చరణం 2:


పాల బుగ్గలు పూచె లేత కెంపులు

వాలు చూపులందుతోటె వయసు జోరులు


చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు

చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు 

    

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 


చరణం 3:


ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి

ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 

ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి

ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 


ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి

ఇపుడేవేవో...

ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి

ఇపుడేవేవో...

ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 


నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా


నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద

నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి