15, నవంబర్ 2025, శనివారం

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల | Edabatu Erugani | Song Lyrics | Badi Panthulu (1972)

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల



చిత్రం : బడి పంతులు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు

తోడు నీడగా వుండే వయసున 

గూడు విడిచి వేరైనారు .. 

గూడు విడిచి వేరైనారు...

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


చరణం 1:


జంటను వీడిన ఒంటరి బ్రతుకై 

జాలిగ కుమిలేరు

జంటను వీడిన ఒంటరి బ్రతుకై 

జాలిగ కుమిలేరు

ఎదలోదాగిన మూగ వేదన 

ఎవరికి చెప్పేరు.. ఎలా భరించేరు...


ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


చరణం 2:


ఒకే తనువుగ ఒకే మనువుగా 

ఆ దంపతులు జీవించారు

ఒకే తనువుగ ఒకే మనువుగ 

ఆ దంపతులు జీవించారు

ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు 

ఆ తలిదండ్రుల పంచారు .. 

ఆ తలిదండ్రుల పంచారు

ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల 

విడదీసింది విధి నేడు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి