14, జులై 2025, సోమవారం

సుడిగాలిలోన దీపం | Sudigalilona Deepam | Song Lyrics | Jeevitha Chakram (1971)

సుడిగాలిలోన దీపం



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం..

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం..  


చరణం 1 :


లోకాన పన్నీరు జల్లేవులే.. 

నీకేమొ కన్నీరు మిగిలిందిలే

పెరవారి గాయాలు మాన్చేవులే.. 

నీలోన పెనుగాయ మాయేనులే

నీలోన పెనుగాయ మాయేనులే

అణగారిపోవు ఆశ.. 

నీవల్లనే  ఫలించె 


సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా..

సుడిగాలిలోన దీపం.. 


చరణం 2 :


ఒక కన్ను నవ్వేటి వేళలో.. 

ఒక కన్ను చమరించసాగునా?

ఒకచోట రాగాలు వికసించునా.. 

ఒక చోట హృదయాలు 

ద్రవియించునా ?

ఒకచోట హృదయాలు 

ద్రవియించునా?


ఎనలేని ప్రాణదానం.. 

ఎద బాధ తీర్చునా?..  

సుడిగాలిలోన దీపం.. 

కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి