18, జులై 2025, శుక్రవారం

కంటి చూపు చెపుతోంది | Kantichupu chebuthondi | Song Lyrics | Jeevitha Chakram (1971)

కంటి చూపు చెపుతోంది



చిత్రం :  జీవిత చక్రం (1971)

సంగీతం :  శంకర్ జైకిషన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : శారద


పల్లవి :


కంటిచూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

కంటిచూపు చెపుతోంది..  

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా


ఆశలూ.. దాచకూ... 

ఆశలూ.. దాచకూ


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


చరణం 1 :


ఆడపిల్లా పూల తీగె.. 

ఒక్కలాగె చక్కనైనవి

ఆడపిల్లా పూల తీగె.. 

ఒక్కలాగె చక్కనైనవి

ఆడపిల్లా.. పూలతీగే ఒక్కలాగే..  

అండ కోరుకుంటాయి.. ఓ.. 


అందమైన జవరాలు 

పొందుకోరి వచ్చింది 

ఎందుకలా చూస్తావు.. ఓ రాజా?

స్నేహమూ చేయవా?.. 

స్నేహమూ చేయవా?.. 


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


చరణం 2 :


కొమ్మమీద గోరువంక 

రామచిలుక జోడు కూడె

కొమ్మమీద గోరువంక 

రామచిలుక జోడు కూడె

కొమ్మమీద గోరువంక రామచిలుక 

ముద్దుపెట్టుకున్నాయి.. ఓయ్


మెత్తనైన మనసు నాది 

కొత్త చిగురు వేసింది

మత్తులోన మునిగింది.. ఓ రాజా..

మైకమూ పెంచుకో.. 

మైకమూ పెంచుకో


కంటి చూపు చెపుతోంది.. 

కొంటెనవ్వు చెపుతోంది

మూగమనసులో మాట.. ఓ రాజా

ఓ.....  రాజా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి