2, ఏప్రిల్ 2025, బుధవారం

చిటపటా చినుకులు | Chitapata Chinukulu | Song Lyrics | Agent Gopi (1978)

చిటపటా చినుకులు



చిత్రం :  ఏజెంట్ గోపి (1978)

సంగీతం : సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


చిటపటా చినుకులు.. 

మన కోసం కురిశాయి

అవి మనలోన ఏవో ఆశలు రేపాయి


ఉరుములు మెరుపులు 

మనలాగే కలిశాయి

అవి మనలోన ఏవో ఆశలు రేపాయి...

చిటపటా చినుకులు.. 

మనకోసం కురిశాయి 


చరణం 1 :


ఈ చలిగాలి ఎంతో అల్లరిది 

అది నాపైట చెంగే లాగింది

ఈ చలిగాలి ఎంతో అల్లరిది 

అది నాపైట చెంగే లాగింది 


హా.. వెచ్చని కౌగిలి పైటగా చేసుకో..

గాలిని వానని జంటగా గెలుచుకో...


చిటపటా చినుకులు.. 

మనకోసం కురిశాయి 


చరణం 2 :


నే చూడంది చూశా ఈనాడు .. 

ఆ చూసింది నాదే ఏనాడు

నే చూడంది చూశా ఈనాడు .. 

ఆ చూసింది నాదే ఏనాడు 


అంతగా చూడకు 

సిగ్గులో ముంచకు

అందుకో వలపులు.. 

పంచుకో తలపులు..

ఉరుములు మెరుపులు 

మనలాగే కలిశాయి

అవి మనలోన ఏవో 

ఆశలు రేపాయి...

చిటపటా చినుకులు.. 

మనకోసం కురిశాయి


- పాటల ధనుస్సు 


1 కామెంట్‌:

  1. బాలు పాటలు anr కి ఎన్టీఆర్కృ కి బదనాం చేసినా ష్ణ కి శోభన్ బాబు కి ఏనాడూ బాగున్నాయ్. సత్యం గారి మ్యూజిక్ అంటే నాకు ప్రాణం. విన్నంత హాయి స్క్రీన్ మీద లేదు. జయప్రద టాప్ అయినా కృష్ణ కూడా పర్వాలేక పోయినా ఘంటసాల anr ఎన్టీఆర్ అలవాటు అయిపోయి ఎంతైనా నెక్స్ట్ కేటగిరి మాత్రమే అయినా ఏజ్ ఏ మేటర్ ఆఫ్ ఫెక్ట్ మొలిడియస్ సాంగ్

    రిప్లయితొలగించండి