18, మార్చి 2025, మంగళవారం

నీలో విరిసిన అందాలన్నీ | Neelo Virisina Andalanni | Song Lyrics | Manushulu Mattibommalu (1974)

నీలో విరిసిన అందాలన్నీ



చిత్రం :  మనుషులు - మట్టిబొమ్మలు (1974)

సంగీతం :  బి. శంకర్

గీతరచయిత : సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


నీలో విరిసిన అందాలన్నీ 

నాలో వీడని బంధాలాయె

ఓ ఓ ఓ.. నీలో పలికిన రాగాలన్నీ 

నాలో శ్రావణ మేఘాలాయె

ఊఁ ఊఁ.. నీ..లో విరిసిన అందాలన్నీ 

నా..లో వీడని బంధాలాయె


చరణం 1:


అల్లరి గాలి నిమిరే దాకా 

మల్లె మొగ్గకు తెలియదు...

ఏమనీ

తానొక తుమ్మెదకై తపియించేననీ.. 

తానొక తుమ్మెదకై తపియించేననీ


మూగ కోరికా ముసిరే దాకా.. 

మూగ కోరికా ముసిరే దాకా

మూసిన పెదవికి తెలియదు .. 

ఏమనీ

తానొక ముద్దుకై తహతహలాడేనని.. 

తానొక ముద్దుకై తహతహలాడేనని

ఆ కోరికలే ఇద్దరిలోనా.. 

ఆ కోరికలే ఇద్దరిలోనా.. 

కార్తీక పూర్ణిమలై వెలగాలి


నీ..లో విరిసిన అందాలన్నీ 

నా..లో వీడని బంధాలాయె

ఓ ఓ ఓ..


చరణం 2:


మధుమాసం వచ్చే దాకా 

మామిడిగున్నకు తెలియదు...

ఏమనీ

తానొక వధువుగా ముస్తాబైనాననీ.. 

తానొక వధువుగా ముస్తాబైనాననీ


ఏడడుగులు నడిచేదాకా.. 

ఏడడుగులు నడిచేదాకా

వధూవరులకే తెలియదు..

ఏమనీ

ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ.. 

ఆ ఏడడుగులు ఏడేడు జన్మల బంధాలనీ

ఆ బంధాలే ఇద్దరిలోనా.. 

ఆ బంధాలే ఇద్దరిలోనా.. 

కార్తీక పూర్ణిమలై వెలగాలి


నీ..లో విరిసిన అందాలన్నీ 

నా..లో వీడని బంధాలాయె

ఓ .. ఓ .. ఓ ... నీ..లో పలికిన రాగాలన్నీ 

నా..లో శ్రావణ మేఘాలాయె


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి