అల్లరి చూపుల కవ్వించే
చిత్రం : గుండెలు తీసిన మొనగాడు (1974)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
ఓ... అల్లరి చూపుల కవ్వించే
అందాల నా చెలీ
ఓ... అల్లరి చూపుల కవ్వించే
అందాల నా చెలీ
నా కన్నుల ముందే నీవుంటే . .
ఇంకేల జాబిలీ
ఓ... అల్లరి చూపుల కవ్వించే
అందాల నా చెలీ
చరణం 1 :
నీ నడక హంసకే రాదూ..
నీ సొగసు మల్లికే లేదూ
నీ నడక హంసకే రాదూ..
నీ సొగసు మల్లికే లేదూ
నీ పలుకు కోయిలకు రాదూ..
నీ కులుకు లేడిలో లేదూ
అందాల రాశి నీవేలే..
అందాల రాశి నీవే..
నీతో సమాన మెవ్వరే?
ఓ .. అల్లరి చూపుల కవ్వించే
అందాల నా చెలీ
చరణం 2 :
నీ కనుల తీరు చూశాను..
నీ కైపులోన సోలాను
నీ కనుల తీరు చూశాను..
నీ కైపులోన సోలాను
నీ మనసు లోతు చూశాను..
నీ వలపులోన తేలాను
నీ పొందు కోరి ఉన్నానే..
నీ పొందు కోరి ఉన్నా..
ఇదిగో సలాము అందుకో
ఓ.. అల్లరి చూపుల కవ్వించే
అందాల నా చెలీ
నా కన్నుల ముందే నీవుంటే
ఇంకేల జాబిలీ
లాలాలా లాలాలాలా లాలాలాలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి