7, డిసెంబర్ 2024, శనివారం

సింగినాదం జీలకర్రరో | Singinadham Jeelakarraro | Song Lyrics | Pichimaraju (1975)

సింగినాదం జీలకర్రరో



చిత్రం: పిచ్చిమారాజు (1975)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి : 


సింగినాదం జీలకర్రరో.. 

అసలు సంగతేమొ గుండుసున్నరో

సింగినాదం జీలకర్రరో.. 

అసలు సంగతేమొ గుండుసున్నరో


సింగినాథ౦ జీలకర్రలే.. 

మన సంగతంత నిండు కుండలే

సింగినాథ౦ జీలకర్రలే.. 

మన సంగతంత నిండు కుండలే


చరణం 1 :


ఆకు తోటకాడ నన్ను 

ఆకలిగా చూశావు.. 

చీకటడేదాక చూస్తు 

చెట్టులా నిలిచావు

ఆకు తోటకాడ నన్ను 

ఆకలిగా చూశావు.. 

చీకటడేదాక చూస్తు 

చెట్టులా నిలిచావు

ఎట్టారా..  ఏగేది నీతోటి.. 

ఏం చేయమ౦టావురో చూపు తోటి


ఆకు తోటలో ఎట్టా 

బంతిపువ్వు పూచెననీ.. 

అమావాస చీకట్లో 

జాబిలెట్ట వచ్చెననీ 

ఆకు తోటలో ఎట్టా 

బంతిపువ్వు పూచెననీ.. 

అమావాస చీకట్లో 

జాబిలెట్ట వచ్చెననీ 

చూస్తు౦డిపోయానే నీ వైపు..  

నీ చూపుల్లో ఉన్నదే ఆ కైపు   


సింగినాదం.... సింగినాదం

సింగినాదం జీలకర్రరో.. 

అసలు సంగతేమొ గుండుసున్నరో


చరణం 2 :


జొన్న చేను బాగుంది 

రమ్మంటే వచ్చాను.. 

మంచె దించమంటే 

నీ మొలపట్టి దించాను

జొన్న చేను బాగుంది 

రమ్మంటే వచ్చాను.. 

మంచె దించమంటే 

నీ మొలపట్టి దించాను

నా వైపు చూశావు జాణల్లె.. 

నవ్వేసి వెళ్లావు మెరువల్లె


కంకి చూచైన నీకు 

కాక పుట్టుననుకున్నా.. 

నడుం పట్టినపుడైనా 

నలిగి పోతాననుకున్నా

కంకి చూచైన నీకు 

కాక పుట్టుననుకున్నా..  

నడుం పట్టినపుడైనా 

నలిగి పోతాననుకున్నా

నరాల్లో పులుపులేని చిన్నోడా..  

నవ్వకేం చేసేది పిచ్చోడా


సింగినాదం.... సింగినాదం

సింగినాథ౦ జీలకర్రలే.. 

మన సంగతంత నిండు కుండలే

సింగినాదం జీలకర్రరో.. 

అసలు సంగతేమొ గుండుసున్నరో


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి