7, డిసెంబర్ 2024, శనివారం

ముద్దు ముద్దు నవ్వు | Muddu Muddu Navvu | Song Lyrics | Sattekalapu Satteyya (1969)

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ



చిత్రం :  సత్తెకాలపు సత్తయ్య (1969)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి


పల్లవి :


ఓలలలాయి ఒలలలాయి ఒలలలలాయి... 


 ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


చరణం 1 : 


 ఏ ఇంటి పంటవో...  ఏ తల్లి నోమువో

ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ప్రాణాలు పోసావు... బతకాలి అన్నావు

ఉరితాడు జోజోల ఉయ్యాల చేసావు

ఉయ్యాల చేసావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


చరణం 2 :


 నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


చిన్నారి పొన్నారి... చిగురల్లె వెలిసావు

సిరిలేదు గిరిలేదు... మనసుంటే అన్నావు..

మనసుంటే అన్నావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి