28, నవంబర్ 2024, గురువారం

సంతోషం చేసుకుందాం | Santhosam Chesukundam | Song Lyrics | Akka Chellelu (1970)

సంతోషం చేసుకుందాం



చిత్రం : అక్కాచెల్లెలు (1970)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : సుశీల   


పల్లవి :  


సంతోషం చేసుకుందాం 

నాతో ఉంటావా

సరదాలు తీర్చుకొందాం 

నాతో వస్తావా

నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా


సంతోషం చేసుకుందాం 

నాతో ఉంటావా

సరదాలు తీర్చుకొందాం 

నాతో వస్తావా

నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా


చరణం 1 :


నీ ఇంట్లో తీరని కోరిక... 

మా ఇంట్లో తీరుస్తా

ఇన్నాళ్ళు చేయని సరసం... 

ఈనాడే చేయిస్తా

నీ ఇంట్లో తీరని కోరిక... 

మా ఇంట్లో తీరుస్తా

ఇన్నాళ్ళు చేయని సరసం... 

ఈనాడే చేయిస్తా


మొగమాటం లేని ముచ్చట... 

మగవాడా దొరుకునిచ్చట

మొగమాటం లేని ముచ్చట... 

మగవాడా దొరుకునిచ్చట

విచ్చలవిడి శృంగారం లో... 

నునువెచ్చని హాయి ఇచ్చట..హాయ్


నాతో వస్తావా... వస్తావా... వా వా వా వా


సంతోషం చేసుకుందాం 

నాతో ఉంటావా

సరదాలు తీర్చుకొందాం 

నాతో వస్తావా

నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా 


చరణం 2 : 


చేతకాని వాళ్ళే ఏన్నో నీతులు చెప్తారు

చేతనైన వాళ్ళే నా చెలిమిని చేస్తారు

చేతకాని వాళ్ళే ఏన్నో నీతులు చెప్తారు

చేతనైన వాళ్ళే నా చెలిమిని చేస్తారు


పడుచుతనం పోతే రాదు 

పరవశిస్తే నేరం కాదు

పడుచుతనం పోతే రాదు 

పరవశిస్తే నేరం కాద్

కదలక సై అన్నావంటే..ఏ.. ఏ..

స్వర్గమెంతో దూరంలేదు..హా..ఆయ్


నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా


చరణం 3  :


ఒడిలోన చక్కని చుక్క... 

ఒళ్ళుమరచి రావాలి

కడుపులోన వేసిన చుక్క... 

కైపెంతో ఇవ్వాలి

ఒడిలోన చక్కని చుక్క... 

ఒళ్ళుమరచి రావాలి

కడుపులోన వేసిన చుక్క... 

కైపెంతో ఇవ్వాలి

కరిగిపోని తిమ్మరలోనా... 

కన్నెపిల్ల కౌగిలిలోన

కరిగిపోని తిమ్మరలోనా... 

కన్నెపిల్ల కౌగిలిలోన

కళ్ళుమూసి లోకం మరవాలీ..

ఈ..కలకాలం కరగాలీ..హా..ఆయ్


నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా


సంతోషం చేసుకుందాం 

నాతో ఉంటావా

సరదాలు తీర్చుకొందాం 

నాతో వస్తావా

నాతో వస్తావా... వస్తావా... 

వా వా వా వా 


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి