29, ఆగస్టు 2024, గురువారం

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం | Neekosam Velisindi Prema Mandiram | Song Lyrics | Prema Nagar (1971)

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం 



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల



పల్లవి :


నీకోసం...

నీకోసం...


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం

నీకోసం విరిసింది హృదయ నందనం

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం

నీకోసం విరిసింది హృదయ నందనం


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం


చరణం 1 :


ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది

ప్రతి తీగ నీ ఒంపులు తెంచుకున్నది 


ప్రతి పాదున నీ మమతే పండుతున్నది

ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నది 


నీకోసం విరిసింది హృదయ నందనం

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం


చరణం 2 :


అలుపు రాని వలపును ఆదుకునే దిక్కడ

చెప్పలేని తలపులు చేతలయే దిక్కడ 


చెడిపోని బంధాలు వేసుకునేదిక్కడ

తొలిచే మీ అనుభవాలు తుది చూసేదిక్కడ

ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓ..ఓ..ఆహహహా..ఓ..ఓ..ఓ... 


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం


చరణం 3 :


కలలెరుగని మనసుకు కన్నెరికం చేశావు

శిల వంటి మనిషిని శిల్పంగా చేశావు


తెరవని నా గుడి తెరిచి దేవివై వెలిశావు

నువ్ మలచిన ఈ బతుకు నీకే నైవేద్యం 

ఆ.. ఆ.. ఆ.. ఓ..ఓ..ఓ..ఆహహహా..ఓ..ఓ..ఓ... 


నీకోసం వెలిసింది ప్రేమ మందిరం

నీకోసం విరిసింది హృదయ నందనం

నీకోసం వెలిసింది ప్రేమ మందిరం

నీకోసం...

నీకోసం...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి