28, ఆగస్టు 2024, బుధవారం

నా ప్రేమకే శెలవూ | Naa Premake Salavu | Song Lyrics | Neerajanam (1988)

నా ప్రేమకే శెలవూ



చిత్రం: నీరాజనం (1988) 

సంగీతం: ఓ.పి. నయ్యర్ 

గీతరచయిత: రాజశ్రీ 

నేపధ్య గానం: బాలు 


పల్లవి : 


హ్మ్.. ఊఁఊఁ... 

హ్మ్.. ఊఁఊఁ... 


నా ప్రేమకే శెలవూ..ఊ.. 

నా దారికే శెలవూ 

కాలానికే శెలవూ..ఊ.. 

దైవానికే శెలవూ 

ఈ శూన్యం నా గమ్యం 

ఈ జన్మకే..ఏ.. శెలవూ 

నా ప్రేమకే శెలవూ..ఊ.. 

నా దారికే శెలవూ 

కాలానికే శెలవూ..ఊ.. 

దైవానికే శెలవూ 


చరణం 1: 


మదిలోని రూపం 

మొదలంత చెరిపీ 

మనసార ఏడ్చానులే..ఏ.. 

కనరాని గాయం 

కసితీర కుదిపీ 

కడుపార నవ్వానులే..ఏ.. 

నా ప్రేమకే శెలవూ..ఊ.. 

నా దారికే శెలవూ 

కాలానికే శెలవూ..ఊ.. 

దైవానికే శెలవూ 


చరణం 2: 


అనుకున్న దీవీ 

అది ఎండమావీ 

ఆ నీరు జలతారులే..ఏ.. 

నా నీడ తానే నను వీడగానే 

మిగిలింది కన్నీరులే..ఏ.. 


నా ప్రేమకే శెలవూ..ఊ.. 

నా దారికే శెలవూ 

కాలానికే శెలవూ..ఊ.. 

దైవానికే శెలవూ 

ఈ శూన్యం నా గమ్యం 

ఈ జన్మకే శెలవూ..ఊ.. 

నా ప్రేమకే శెలవూ 

నా దారికే శెలవూ 

కాలానికే శెలవూ..ఊ.. 

దైవానికే శెలవూ


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి