11, మే 2024, శనివారం

నవ్వుతూ బతికాలిరా | Navvuthu Bathakalira | Song Lyrics| Mayadari Malligadu (1973)

నవ్వుతూ బతికాలిరా 



చిత్రం :  మాయదారి మల్లిగాడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఏయ్... హహహహహ...


నవ్వుతూ బతికాలిరా.. తమ్ముడూ.. 

నవ్వుతూ సావాలిరా..

ఏయ్.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..


సచ్చినాక నవ్వలేవురా.. 

ఎందరేడ్చినా బతికి రావురా.. 

తిరిగిరావురా..

అందుకే.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. నవ్వుతూ సావాలిరా..


చరణం 1:


సంపేది ఎవడురా.. 

సచ్చేది ఎవడురా..

హోయ్.. సంపేది ఎవడురా.. 

సచ్చేది ఎవడురా..

శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..

శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా..

కుడితే సావాలని.. వరమడిగిన సీమ..

కుట్టీ కుట్టక ముందే.. 

సస్తోంది సూడరా..ఆ..ఆ..ఆ..


అందుకే..నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. నవ్వుతూ సావాలిరా..


చరణం 2:


బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు.. 

నువ్వు సస్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు

హహ.. దొంగనాయాళ్ళు..

అది నువ్వు సూసేది కాదు.. 

నిను కాసేది కాదు

అది నువ్వు సూసేది కాదు.. 

నిను కాసేది కాదు

నువ్వు పోయినా..ఆ..ఆ..ఆ..

నువ్వు పోయినా.. 

నీ మంచి సచ్చిపోదురా..

ఏయ్ సన్నాసి.. నవ్వరా


అందుకే.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ.. 

నవ్వుతూ సావాలిరా.. అరేయ్..


చరణం 3:


ఉన్నాడురా దేవుడు.. 

తోడు వస్తాడురా..ఆ.. 

తమ్ముడూ..

ఎప్పుడు?

అన్నాయం జరిగినప్పుడు 

అక్కరమం పెరిగినప్పుడు

అన్నాయం జరిగినప్పుడు 

అక్కరమం పెరిగినప్పుడు

వస్తాడురా...ఆ..ఆ..ఆ

సచ్చినట్టు వస్తాడురా..


అందుకే..నవ్వుతూ..

హైహై.. నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా..

సచ్చినాక నవ్వలేవురా.. 

ఎందరేడ్చినా బతికి రావురా.. 

తిరిగిరావురా..

అందుకే..నవ్వుతూ బతికాలిరా.. 

తమ్ముడూ నవ్వుతూ సావాలిరా.. అరేయ్..


- పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి