12, మే 2024, ఆదివారం

నవ్వే ఓ చిలకమ్మా | Navve O Chilakamma | Song Lyrics | Annadammulu (1969)

నవ్వే ఓ చిలకమ్మా



చిత్రం : అన్నాదమ్ములు (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :  


నవ్వే ఓ చిలకమ్మా.. 

నీ నవ్వులు ఏలమ్మా

ఆ నటనలు చూడమ్మా.. 

ఏ జవరాలినుడికించకమ్మా   


ఎగిరే ఓ గోరింకా.. 

ఇటు చూడకు మావంకా

నీ ఎత్తులు చాలింకా.. 

మీ మగవారి మాటలే చౌకా

ఎగిరే ఓ గోరింకా.. 


చరణం 1 :


పెళ్ళంటే పిల్లకు ఉబలాటము

అపుడు మొగమాటము.. 

ఇపుడు ఆరాటమూ

పెళ్ళంటే పిల్లకు ఉబలాటము

అపుడు మొగమాటము.. 

ఇపుడు ఆరాటమూ


ప్రేమను కోరే ఈ మగవారు

ప్రేమను కోరే ఈ మగవారు.. 

పెళ్ళనగానే కంగారూ

మూడుముళ్ళు వేయాలంటే.. 

మూతి ముడుచుకొంటారూ

మూడుముళ్ళు వేయాలంటే.. 

మూతి ముడుచుకొంటారూ


హోయ్...నవ్వే ఓ చిలకమ్మా ఆ....

నీ నవ్వులు ఏలమ్మా

అహా....నీ నటనలు చూడమ్మా

ఆ.. ఏ జవరాలినుడికించకమ్మా...

నవ్వే ఓ చికమ్మా...


చరణం 2 :


అబ్బాయిగారి బండారము..

ముందు వెటకారము..  

పిదప మమకారమూ


కోపము లేని ఈ ఆడవారు

కోపము లేని ఈ ఆడవారు.. 

కోర చూపులే చూస్తారూ

కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. 

కొంగు చివర కడతారు

కొమ్ములెన్నో తిరిగిన వాణ్ణి.. 

కొంగు చివర కడతారు 


ఎగిరే ఓ..గోరింకా... ఆ...

ఇటు చూడకు మావంకా ఆ..ఆ...

నీ ఎత్తులు చాలింకా ఆ....

మీ మగవారి మాటలే చౌకా...

నవ్వే ఓ..చిలకమ్మా.... 


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి