13, ఏప్రిల్ 2024, శనివారం

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి | Cheredetako Telisi | Song Lyrics | Prema Bandham (1976)

చేరేదెటకో తెలిసి చేరువకాలేమని తెలిసి



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  :  బాలు, సుశీల


పల్లవి:


ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁహూఁ

లాల లార రరా..రా.రా..రా..రా ఊఁహూఁ..


చేరేదెటకో తెలిసి.. చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకో..ఓ..ఓ..ఓ 

తెలిసి..తెలిసి..తెలిసి


కలవని తీరాల నడుమ.. 

కలకల సాగక యమునా

వెనుకకు తిరిగి పోయిందా... 

మనువు గంగతో మానిందా?

ఊఁ..ఊఁహూఁ.. ఊఁహూ..

చేరేదెటకో తెలిసి ..చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ

తెలిసి..తెలిసి..తెలిసి..



చరణం 1:


జరిగిన కథలో బ్రతుకు తెరువులో.. 

దారికి అడ్డం తగిలావూ..ఊ..ఊ

ముగిసిన కథలో మూగ బ్రతుకులో..ఓ.. 

నా దారివి నీవై మిగిలావూ..ఊ


పూచి పూయని పున్నమలో.. 

ఎద దోచి తోడువై పిలిచావు

గుండెలు రగిలే ఎండలలో.. 

నా నీడవు నీవై నిలిచావు

ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ



చేరేదెటకో తెలిసి.. 

చేరువకాలేమని తెలిసి

చెరిసగమైనామందుకే..ఏ..ఏ..ఏ

తెలిసి..తెలిసి... తెలిసి..


చరణం 2:


తూరుపు కొండల తొలి తొలి సంధ్యల... 

వేకువ పువ్వు వికసిస్తుందీ..ఈ..ఈ..ఈ


విరిసిన పువ్వూ..ఊ..ఊ.. కురిసిన తావి...

విరిసిన పువ్వూ... కురిసిన తావి

మన హృదయాలను వెలిగిస్తుంది..ఈ..ఈ..ఈ

చీకటి తెరలు తొలిగిస్తుంది


ఊఁహుఁ..ఊఁహూఁ..అహ అహా..ఆహ ఆహా...ఆ..ఆ


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి