13, ఏప్రిల్ 2024, శనివారం

అంజలిదే గొనుమా ప్రియతమా | Anjalide gonuma | Song Lyrics | Prema Bandham (1976)

అంజలిదే గొనుమా... ప్రియతమా



చిత్రం  :  ప్రేమ బంధం (1976)

సంగీతం  :  కె.వి. మహదేవన్

గీతరచయిత  :  వేటూరి

నేపధ్య గానం  : సుశీల 


పల్లవి :


అంజలిదే గొనుమా ప్రియతమా.. 

మంజుల బృందా నికుంజ నిరంజన

అంజలిదే గొనుమా ప్రియతమా.. 

మంజుల బృందా నికుంజ నిరంజన

అంజలిదే గొనుమా ...


చరణం 1 :


గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. 

బుజ్జగించి లాలించి సొగసిడి

గుజ్జురూపమున  కమిలిన కుబ్జను.. 

బుజ్జగించి లాలించి సొగసిడి 


ముజ్జగాలకే ముద్దబంతిగా..

ముజ్జగాలకే ముద్దబంతిగా.. 

మలచిన దేవా... మహానుభావ

అంజలిదే గొనుమా... ప్రియతమా


చరణం 2 :


నిండు కొలువులో పాండవ కాంతకు.. 

వలువలూడ్చుతరి వనిత మొరవిని

నిండు కొలువులో పాండవ కాంతకు.. 

వలువలూడ్చుతరి వనిత మొరవిని


మానము గాచి...  మానిని బ్రోచిన..

మానము గాచి...  మానిని బ్రోచిన..  

మాధవ దేవా... మహానుభావా...  


అంజలిదే...  గొనుమా


చరణం 3 :


బృందావనిలో చందమామవై.. 

చెలువల కలువల జేసి రమించి

బృందావనిలో చందమామవై ..

చెలువల కలువల జేసి రమించి


బిసజపత్ర జల బిందువువై..

బిసజపత్ర జల బిందువువై...  

ఇల మసలిన దేవా


మహానుభావా .. అంజలిదే గొనుమా


పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి