25, మార్చి 2024, సోమవారం

వ్రేపల్లె వేచెను వేణువు వేచెనూ | Vrepalle vechenu | Song Lyrics | Sharada (1973)

వ్రేపల్లె వేచెను వేణువు వేచెనూ



చిత్రం :  శారద (1973)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  సుశీల



పల్లవి :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. 

వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ

వ్రేపల్లె వేచెనూ వేణువు వేచెనూ

వనమెల్ల వేచేనురా..... 

నీరాక కోసం నిలువెల్ల కనులై

నీరాక కోసం నిలువెల్ల కనులై

ఈ రాధ వేచేనురా...


రావేలా...  రావేలా 


చరణం 1 :


కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని...

కోకిలమ్మ కూయనన్నదీ నీవు లేవని

గున్న మావి పూయనన్నదీ నీవు రావని

ఆ...... ఆ....... ఆ.....  ఆ..

కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా

కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా

కదలాడే యమునా నది...


నీరాక కోసం నిలువెల్ల కనులై

నీరాక కోసం నిలువెల్ల కనులై

ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా 


చరణం 2 :


మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని

మా వాడ అంటున్నదీ స్వామి వస్తాడని

నా నీడ తానన్నదీ రాడు రాడేమని

ఆ......  ఆ......  ఆ.....  ఆ..... 

రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా

రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా

రావేల...  చిరుజల్లుగా


నీరాక కోసం నిలువెల్ల కనులై

నీరాక కోసం నిలువెల్ల కనులై

ఈ రాధ వేచేనురా

రావేలా రావేలా


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి