25, మార్చి 2024, సోమవారం

కన్నె వధువుగా మారేది | Kanne Vadhuvuga maredi | Song Lyrics | Sharada (1973)

కన్నె వధువుగా మారేది



చిత్రం :  శారద (1973)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


కన్నె వధువుగా మారేది.. 

జీవితంలో ఒకేసారి

ఆ..ఆ.. వధువు వలపే విరిసేది.. 

ఈనాడే తొలిసారి


అందుకే.. అందుకే.. 

తొలి రేయి అంత హాయి.. అంత హాయి..

అంత హాయి.. 



చరణం 1 :


వెన్నెల కాచే మోమును దాచి.. 

చీకటి చేసేవు ఎందుకని

ఇంతటి సూర్యుడు ఎదుట నిలువగా.. 

ఈ మోము జాబిలి దేనికని

అల్లరి చూపులతోనే.. 

నను అల్లుకు పోయేవెందుకని

అల్లరి చూపులతోనే.. 

నను అల్లుకు పోయేవెందుకని

ఆ..ఆ.. అల్లికలోనే తీయని.. 

విడదీయని బంధం ఉన్నదని


అందుకే.. అందుకే.. 

తొలి రేయి అంత హాయి.. అంత హాయి..

అంత హాయి.. 


చరణం 2 :


నీ పెదవి కనగానే.. 

నా పెదవి పులకించింది ఎందుకని

నీ పెదవి కనగానే.. 

నా పెదవి పులకించింది ఎందుకని

విడివిడిగా ఉండలేక..

విడివిడిగా ఉండలేక.. పెదవులు.. రెండూ..

అందుకని..



ఎదురు చూసే పూల పానుపు.. 

ఓపలేక ఉసురుసురన్నది ఎందుకని

ఇద్దరిని తన కౌగిలో.. ముద్దు ముద్దుగా..

అందుకని..


అందుకే.. అందుకే.. తొలి రేయి.. 

అంత హాయి.. అంత హాయి..

అంత హాయి.. అంత హాయి..

అంత హాయి..


పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి