8, జనవరి 2024, సోమవారం

మా వారు బంగారు కొండా | Maa Vaaru Bangaru Konda | Song Lyrics | Prema Murthulu (1982)

మా వారు బంగారు కొండా



చిత్రం : ప్రేమ మూర్తులు (1982)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


మా వారు బంగారు కొండా...

మా వారు బంగారు కొండా... 

మనసైన అందాల దొంగా

పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా

కనుగీటుతు ఉంటారు...  

నను వదలను అంటారు


మా రాధా బంగారు కొండా..

మా రాధా బంగారు కొండా... 

మనసైన అందాల దొంగా

కడకొంగున కట్టేసి...  

తన చుట్టు తిప్పేసి

చిలిపిగ ఉడికిస్తుంది...  

కిలకిల నవ్వేస్తుంది 


మా వారు బంగారు కొండా... 

మా రాధా బంగారు కొండా



చరణం 1 :


మురిపాలను కలబోసి 

చిరు ముద్దలు పెడుతుంటే

కొనవేలు కొరికింది ఎవరో

మలి సంధ్యల జిలుగులను 

మౌనంగా చూస్తుంటే

అరికాలు గిల్లింది ఎవరో


నిదురలోన నేనుంటే 

అదను చూసి ముద్దాడి

ఒదిగిపోయి చూసింది ఎవరో

ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట

ఆడింది ఇద్దరము అవునా..


మా వారు బంగారు కొండా.. 

మా రాధా బంగారు కొండా



చరణం 2 :


గుబురేసిన చీకట్లో గుబులేదో నటియించి

గుండె మీద వాలిపోలేదా

గుడిమెట్లు దిగుతుంటే పడిపోతావంటూ

నా నడుమండి పెనవేయలేదా


సీమంతం కావాలా శ్రీమతిగారు అంటే

సిగ్గుతో తలవాల్చలేదా

ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో

ఆనాడె తెలుసుకోలేదా..


మా రాధా బంగారు కొండా... 

మనసైన అందాల దొంగా

పొద్దైనా మాపైనా ఎవరున్నా ఏమన్నా

కనుగీటుతు ఉంటారు 

నను వదలను అంటారు

మా వారు బంగారు కొండా.. 

మా రాధా బంగారు కొండా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి