ఇంతటి సొగసే ఎదురగ ఉంటే
చిత్రం: నిండు మనిషి (1978)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఇంతటి సొగసే ఎదురగ ఉంటే...
తుంటరి మనసే తొందర పెడితే...
ఏమీ అనుకోకు... హ.. ఏమీ అనుకోకు
ఇంతటి సొగసే ఎదురగ ఉంటే..
ఇరువురు నడుమా.. తెరలే ఉంటే...
ఏమీ అనుకోకు... హాయ్.. ఏమీ అనుకోకు
చరణం 1:
లేత లేత పొంగులేమో...
లేనిపోని అల్లరి చేస్తే..
ఏపులోన ఉన్న నేను ఎలా ఊరుకోను....
హ.. ఆ.. లేత లేత పొంగులేమో...
లేనిపోని అల్లరి చేస్తే..
ఏపులోన ఉన్న నేను ఎలా ఊరుకోను....
వద్దు వద్దు ఇప్పుడొద్దు...
ముందు ముందూ ఉందీ విందు...
ఏమీ అనుకోకు..... ఏమీ అనుకోకు...
ఇంతటి సొగసే ఎదురగ ఉంటే...
ఇరువురు నడుమా.. తెరలే ఉంటే...
ఏమీ అనుకోకు... హాయ్.. ఏమీ అనుకోకు...
చరణం 2:
చిన్నవాని కౌగిలిలోనా
కన్నె వయసు కాగుతుంటే...
ఎన్ని ఎన్ని తెరలో ఉన్నా...
ఎలా ఆగిపోను...
హా... చిన్నవాని కౌగిలిలోనా
కన్నె వయసు కాగుతుంటే...
ఎన్ని ఎన్ని తెరలో ఉన్నా...
ఎలా ఆగిపోను...
వద్దు వద్దు ఆగవద్దు...
ఇచ్చుకోవా ఒక్క ముద్దు...
ఏమీ అనుకోకు.. ఆ.. ఆ.....
ఏమీ అనుకోకు...
ఇంతటి సొగసే ఎదురగ ఉంటే...
తుంటరి మనసే తొందర పెడితే...
ఏమీ అనుకోకు..... ఏమీ అనుకోకు
ఏమీ అనుకోకు... హా... ఏమీ అనుకోకు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి