ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ
గానం  : SP బాలసుబ్రహ్మణ్యం , P సుశీల ,
రచన  : Dr C నారాయణ  రెడ్డి ,
సంగీతం : ఘంటసాల ,
చిత్రం : రామరాజ్యం  (1973)
పల్లవి :
ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ.. 
ఎందుకండీ ఇంతలోనే కంగారూ
ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ..  
ఎందుకండీ ఇంతలోనే కంగారూ
అయ్యో రామా..  అయ్యో రామా
గుళ్లోనీ మాట వింటె అమ్మాయిగారూ
గుండెల్లో గుబులేసింది బొమ్మయ్ గారూ
అయ్యో రామా . . . అయ్యో రామా  
చరణం 1 :
పిల్లా పాపా కలగాలనీ.. 
చల్లని దీవెన వినలేదా
ఆ దీవెన వింటూ ఔనంటూ 
కోవెల గంటలు అనలేదా
పిల్లలు వద్దంటానా.. 
ఈ పిల్లను కాదంటానా
ఆ పెళ్ళికానిదే ఏలాగనీ.. 
తల్లకిందు లౌతున్నానమ్మీ    
ఏమండీ లేతబుగ్గల లాయర్ గారూ.. 
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యో రామా.. అయ్యో రామా
అయ్యో రామా.. అయ్యో రామా 
చరణం 2 :
మొన్నటి కలలో పిలిచావు.. 
ముద్దులు యిమ్మని అడిగావు
మరి తోడుగ సాగే ఈ వేళ.. 
ఆడపిల్లలా బెదిరేవు
ముద్దులు వద్దంటానా.. 
ఆ ముచ్చట కాదంటానా
మన పెద్దల తీర్పువినాలనీ.. 
ఒద్దికగా వేచి వున్నానమ్మీ   
ఏమండీ లేత బుగ్గల లాయర్ గారూ.. 
ఎందుకమ్మ ఇంతలోనే కంగారూ
అయ్యో రామా.. అయ్యో రామా
అయ్యో రామా.. అయ్యో రామా
పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి