13, ఆగస్టు 2023, ఆదివారం

అందమైన చిన్నవాడు | Andamaina Chinnavadu | Song Lyrics | Bhale Dongalu (1976)

అందమైన చిన్నవాడు



చిత్రం :  భలే దొంగలు (1976)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


అందమైన చిన్నవాడు అలిగినా అందమే..

అందమైన చిన్నవాడు అలిగినా అందమే

పిలిచిన కొలదీ బిగుసుకుపోయే బింకాలింక చాలు 


నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే..

కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు

నంగనాచి ఆడపిల్ల బొంకినా చెల్లులే  


చరణం 1 :


హే.. ప్రేమ వలలోన ప్రియుడు పడగానె.. 

అలుసు చేస్తారు అమ్మాయిలు


ఏదో సరదాకు మాట అంటేను.. 

బెట్టుచేస్తారు అబ్బాయిలు

మారాము.. గారాము.. చాలించు.. 

నీ మారాము గారాము చాలించు  


నంగనాచి.. అహా..  ఆడపిల్ల...  

అహా... బొంకినా చెల్లులే 


చరణం 2 :


ఏమికావాలో నీకు ఇస్తాను.. 

మనసు నీ సొమ్ము చేశానులే


నువ్వు కావాలి నవ్వు కావాలి.. 

ఇపుడె నాలోన కలవాలిలే

నా ముద్దు ఈ పొద్దు తీరాలి.. 

నా ముద్దు ఈ పొద్దు తీరాలి



అందమైన... అహా.. చిన్నవాడు..  

అహా.. అలిగినా అందమే 

కాటుక కన్నుల కవ్విస్తావు.. 

నాటకమింక చాలు


నంగనాచి.. అహా..  ఆడపిల్ల...  

అహా... బొంకినా చెల్లులే


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి