20, జులై 2023, గురువారం

కన్నయ్యా నల్లని కన్నయ్యా | Kannayya Nallani Kannayya | Song Lyrics | Nadee Adajanme (1965)

కన్నయ్యా నల్లని కన్నయ్యా



చిత్రం : నాదీ ఆడజన్మే (1965) 

సంగీతం : టి.వి. రాజు 

గీతరచయిత : ఆర్.సుదర్శనం

నేపధ్య గానం : సుశీల 


పల్లవి: 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా..ఆ.. 


చరణం 1: 


గుణమెంత లేనింట పడవైతువా.. 

నన్ను వెలివేయువారికే బలిచేతువా 

గుణమెంత లేనింట పడవైతువా.. 

నన్ను వెలివేయువారికే బలిచేతువా 

సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 

సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 

మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 


చరణం 2: 


బంగారు మనసునే ఒసగినావు.. 

అందు అందాల గుణమునే పొదిగినావు 

బంగారు మనసునే ఒసగినావు.. 

అందు అందాల గుణమునే పొదిగినావు 


మోముపై నలుపునే పులిమినావు.. 

మోముపై నలుపునే పులిమినావు.. 

ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు 


కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా 

నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 

నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 

నిన్ను కనలేని కనులుండునా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి