21, జులై 2023, శుక్రవారం

ఆడించదా వయసు పాడించదా | Adinchada vayasu | Song Lyrics | Andala Rasi (1980)

ఆడించదా వయసు పాడించదా



చిత్రం :  అందాల రాశి (1980)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా



చరణం 1 :


చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు

చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... 

ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు


రెండిటికి బంధమేసి ఇద్దరినీ ఒకటి చేసి

ముద్దొచ్చే పండుగలో మురిపించదా...

హాయి కురిపించదా... మేను మరపించదా



ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా 



చరణం 2 :



రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు

రమణిలోన ఉంటుందొక రాధా... 

మమత ఉన్న మనిషే మాధవుడు


ఈడుజోడు కుదిరితే తోడునీడ కుదిరితే...

వేడుకగా ప్రేమగీతి పలికించదా

తనివి ఒలికించదా... బ్రతుకు పులకించదా


ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా... 

చూడముచ్చటగా సొగసు ఊరించదా

ఆడించదా వయసు పాడించదా


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి