3, డిసెంబర్ 2022, శనివారం

హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా | Hayiga mattuga | Song Lyrics | Illu Illalu (1972)

హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా



చిత్రం :  ఇల్లు-ఇల్లాలు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  బాలు    



పల్లవి :


హాయిగా మత్తుగా ఆడవే.. అందాల భామా

ఆడాక చూపించు కాసింత ప్రేమా


హాయిగా మత్తుగా ఆడవే.. అందాల భామా

ఆడాక చూపించు కాసింత ప్రేమా

హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా… భామా  



చరణం 1 : 


మధువులు చిలికించే మైకం పొంగుతుంది నీలో

మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో

మధువులు చిలికించే మైకం పొంగుతుంది నీలో

మైకం తట్టుకొనే మగసిరి పొగరుంది నాలో


కైపులు పెంచుకుందాం.. లే.. లే.. లే.. 

సుఖములు పంచుకుందాం..  రా..  రా..  రా

అందాలు నీవి అనుభవం నాది..  

ఆనందం.. ఇదే.. ఇదే  


హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా… భామా 



చరణం 2 :



కొత్తగ మురిపించు.. పాతను మరపించు ముద్దుగా 

ఘుమఘుమలాడించు.. కోరిక పండించు వెచ్చగా

కొత్తగ మురిపించు.. పాతను మరపించు ముద్దుగా 

ఘుమఘుమలాడించు.. కోరిక పండించు వెచ్చగా


రేపు నువ్వెక్కడో ఏమోలే.. రేపు నేనెవ్వరో..  ఏమోలే

ఈ రోజు మోజు ఈ రేయి హాయి.. ఇద్దరికీ చాలు.. చాలు       


హాయిగా మత్తుగా ఆడవే అందాల భామా

ఆడాక చూపించు కాసింత ప్రేమా

హాయిగా.. మత్తుగా.. ఆడవే అందాల భామా… భామా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి