3, డిసెంబర్ 2022, శనివారం

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో | Aku Pachani Chelu | Song Lyrics | Illu Illalu (1972)

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో



చిత్రం :  ఇల్లు-ఇల్లాలు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  సుశీల   



పల్లవి :


ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. 

ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. 

ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో


అందాల మా పల్లె అల్లో నేరెళ్లో.. 

అందాల మా పల్లె అల్లో నేరెళ్లో

ఆ నాటి వ్రేపల్లె అల్లో నేరెళ్లో..

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. 

ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో   



చరణం 1 : 


నీలి మబ్బుల్లోన కనిపించేవి 

బాలకృష్ణుని మేని నిగనిగలే

నీలి మబ్బుల్లోన కనిపించేవి 

బాలకృష్ణుని మేని నిగనిగలే


అల్లరిగాలిలో వినిపించేవి 

అల్లరిగాలిలో వినిపించేవి 

పిల్లనగ్రోవి సవ్వడులే

పాల పొదుగుల ఆలమందలే..

పాల పొదుగుల ఆలమందలే.. 

ఊరించే తీయని కోరికలే   


ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. 

ఆపైన పైరగాలి అల్లో నేరెళ్లో 



చరణం 2 :



తీయ మామిళ్ల తొలకరి పూతలు

తెలుగు కన్నియల తొలిసిగ్గులే

తీయ మామిళ్ల తొలకరి పూతలు

తెలుగు కన్నియల తొలిసిగ్గులే

చిలిపిగ పాడే కలికి కోయిలలు

చిలిపిగ పాడే కలికి కోయిలలు.. 

పలికేది నెరజాణల భావాలే


ఏటితరగలా.. 

నీటి నురగలా ఏటితరగలా

నీటి నురగలా.. 

మెరిసేవి పరువాల చిరునవ్వులే      

ఆకూ పచ్చని చేలు అల్లో నేరెళ్లో.. 

ఆ పైన పైరగాలి అల్లో నేరెళ్లో

అందాల మా పల్లె అల్లో నేరెళ్లో.. 

అందాల మా పల్లె అల్లో నేరెళ్లో

ఆనాటి వ్రేపల్లె అల్లో నేరెళ్లో

ఒహూహూ…. ఒహూహూ….. 

ఒహూహూహూహూ..

ఒహూహూహూహూ.. ఒహూహూహూహూ


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి