4, నవంబర్ 2022, శుక్రవారం

నెలలు నిండిన అమ్మ కనకమానదు | Nelalu nindina amma | Song Lyrics | Maga Maharaju (1983)

నెలలు నిండిన అమ్మ కనకమానదు 



చిత్రం : మగ మహారాజు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి :


నెలలు నిండిన అమ్మ కనకమానదు...

వండివార్చినా అమ్మ తినకమానదు...

మొగ్గలేసినా కొమ్మా పూత మానదు

పందిరేసినా ఇంట పెళ్లి ఆగదు...


అరెరెరెరే...

రేపో ఎల్లుండో ఏకాశి పొద్దున్నో 

నీ పెళ్లి అవుతుందిలే

పెళ్లి పందిట్లో పిల్లా సిగ్గుల్తో 

తాంబూలమిస్తుందిలే



చరణం 1 :


ఎన్నెట్లో మల్లెల్లా ఎరుపెక్కుతున్నాయి.. 

పదహారు నీ వన్నెలు

చిన్నదానా.. పడనీక నా కన్నులు

ఎండల్లో వానల్లా మెరుపెక్కుతున్నాయి... 

నునులేత నీ సిగ్గులు

కన్నె కూన ముద్దాడనీ బుగ్గలు


బాసలొచ్చేనమ్మ కంటికి... 

కొత్త యాశలొచ్చేనమ్మ చూపుకి

పెళ్లి నూరేలంట జంటకి... 

ప్రేమలల్లుకున్న బొమ్మరింటికి




నెలలు నిండిన అమ్మ కనకమానదు...

వండివార్చినా అమ్మ తినకమానదు...

మొగ్గలేసినాకొమ్మా పూత మానదు

పందిరేసినా ఇంట పెళ్లి ఆగదు...


అరెరెరెరే...

రేపో ఎల్లుండో ఏకాశి పొద్దున్నో 

నీ పెళ్లి అవుతుందిలే

పెళ్లి పందిట్లో పిల్లా సిగ్గుల్తో 

తాంబూలమిస్తుందిలే ... లే.. లే... లే



చరణం 2 :


కళ్ళల్లో పాపమ్మ కవ్విస్తూ ఉన్నాది... 

కౌగిల్లకే రమ్మని

సన్నజాజి పొదరిల్లకే పొమ్మని

జల్లోనా పువ్వమ్మ జరిపిస్తూ ఉన్నాది... 

పగలంతా నీ రాతిరి

కొత్త ఈడు సెగలంటినా అల్లరి


రెక్కలొచ్చేనమ్మ ఆశకి... 

ఎన్ని రేపులొచ్చేనమ్మ నేటికి

ఇద్దరుండాలంట ముద్దుకి... 

మూడు ముళ్ళు కోరే కొత్త పొద్దుకి


నెలలు నిండిన అమ్మ కనకమానదు...

వండివార్చినా అమ్మ తినకమానదు...

మొగ్గలేసినాకొమ్మా పూత మానదు

పందిరేసినా ఇంట పెళ్లి ఆగదు...


అరెరెరెరే...

రేపో ఎల్లుండో ఏకాశి పొద్దున్నో 

నీ పెళ్లి అవుతుందిలే

పెళ్లి పందిట్లో పిల్లా సిగ్గుల్తో 

తాంబూలమిస్తుందిలే


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి