3, నవంబర్ 2022, గురువారం

నీ దారి పూల దారి పోవోయి బాట సారి | Nee Dari Poola Dari | Song Lyrics | Maga Maharaju (1983)

నీ దారి పూల దారి.. పోవోయి బాట సారి 



చిత్రం : మగ మహారాజు (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు


పల్లవి :


నీ దారి పూల దారి.. పోవోయి బాట సారి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరి

నీ దారి పూల దారి.. పోవోయి బాట సారి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరీ 


చరణం 1 :


ఆశయాలు గురిగా.. సాహసాలు సిరిగా

సాగాలి జైత్ర రథం.. వడి వడిగా

మలుపులేన్ని ఉన్నా.. గెలుపు నీదిరన్నా

సాధించు మనోరథం.. మనిషిగా 

నరుడివై హరుడివై నారాయణుడే నీవై

నీ బాసలే ఫలించగా వరించు విజయ లక్ష్మి

నీ బాసలే ఫలించగా వరించు విజయ లక్ష్మి


నీ దారి పూల దారి.. పోవోయి బాట సారి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరీ  


అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా

అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 


చరణం 2 :


కాళరాత్రి ముగిసే.. కాంతి రేఖ మెరిసే

నీ మండిన గుండెల నిట్టుర్పులలో

చల్ల గాలి విసిరే..తల్లి చేయి తగిలే

నీ కోసం విండిన ఒదారుపులతో 

విజయమో..విలయమో..విదివిలాసమేదైనా

నీ రక్తమే జ్వలించగా..జయించు ఆత్మా శక్తి

నీ రక్తమే జ్వలించగా..జయించు ఆత్మా శక్తి 


నీ దారి పూల దారి.. పోవోయి బాట సారి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరి

నీ ఆశలే ఫలించగా.. ధ్వనించు విజయ భేరీ 


అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా

అయ్యప్పా స్వామియే శరణం అయ్యప్పా 


చరణం 3 :



దిక్కులన్ని కలిసే..దైవమొకటి కలిసే

నీ రక్తం అభిషేకం.. చేస్తుంటే

మతములన్ని కరిగే.. మమత దివ్వె వెలిగే

నీ ప్రాణం నైవేద్యం.. పెడుతుంటే 

ధీరుడివై.. వీరుడివై.. విక్రమార్కుడివే నీవై

నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి

నీ లక్ష్యమే సిద్దించగా దీవించు దైవ శక్తి  


నీ దారి పూల దారి ..పోవోయి బాట సారి.

నీ ఆశలే ఫలించగా ...ధ్వనించు విజయ భేరి


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి