29, ఆగస్టు 2022, సోమవారం

ఎవరవయ్యా.. ఎవరవయ్యా | Earavayya Evaravayya | Song Lyrics | Sri Vinayaka Vijayam (1979)

ఎవరవయ్యా.. ఎవరవయ్యా



చిత్రం :  శ్రీ వినాయక విజయం(1979)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :   సుశీల


పల్లవి :


ఎవరవయ్యా...  ఎవరవయ్యా..

ఏ దివ్య భువి నుండి దిగీ..

ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..


ఎవరవయ్యా...  ఎవరవయ్యా..

ఏ దివ్య భువి నుండి దిగీ..

ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..


ఎవరవయ్యా... 



చరణం 1 :


ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని

ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని


ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో


వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో

పూజలలో మొదటి పూజ నీదేనేమో

పూజలలో మొదటి పూజ నీదేనేమో


ఎవరవయ్యా.. ఎవరవయ్యా..

ఏ దివ్య భువి నుండి దిగీ..

ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..

ఎవరవయ్యా.. 



చరణం 2 :


 చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ

చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ


ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో... 

ఎన్నెన్ని వింతలో...

ఎన్నెన్ని కోరికలు నిండి 

నే కన్న ఎన్నెన్నో స్వప్నాలు పండి..

చిన్నారి ఈ మూర్తివైనావో

ఈరేడు లోకాలు ఏలేవో

ఈరేడు లోకాలు ఏలేవో


ఎవరవయ్యా.. ఎవరవయ్యా..

ఏ దివ్య భువి నుండి దిగీ..

ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..


ఎవరవయ్యా.. ఎవరవయ్యా..

ఎవరవయ్యా.. ఎవరవయ్యా..


పాటల ధనుస్సు 



గణపతి బప్పా మోరియా | Ganapathi Bappa Moriya | Song Lyrics | Iddarammayilatho (2013)

గణపతి  బప్పా  మోరియా...



చిత్రం   : ఇద్దరమ్మాయిలతో (2013)

సంగీతం   : దేవి  శ్రీ  ప్రసాద్ 

గానం   : సూరజ్  జగన్ 

రచన   : భాస్కరభట్ల 


గణపతి  బప్పా  మోరియా...   గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... .గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... . గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా...  గణపతి  బప్పా  మోరియా... 


వక్రతుండ  మహా  కయ ... గణపతి  బప్పా  మోరియా 

సూర్యకోటి  సమ  ప్రభ ... గణపతి  బప్పా  మోరియా 

ఓ  నిర్విఘ్నం  కురుమే  దేవా ... గణపతి  బప్పా  మోరియా 

సర్వాకారేషు  సర్వదా ... గణపతి  బప్పా  మోరియా 


గణపతి  బప్పా  మోరియా...   గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... .గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... . గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా...  గణపతి  బప్పా  మోరియా... 


చలో  చలో ... నచ్చే  దారిలో 

నీకే  నువ్వు  చెప్పే  హలో 

గుళ్లో  గుళ్లో ... నడిచే  దారిలో 

నీకు  ఎదురవొచ్చు  భయపెట్టొచ్చు  

ముందడుగేస్తే  గెలిచేయొచ్చు 


గణపతి  బప్పా  మోరియా...   గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... .గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... . గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా...  గణపతి  బప్పా  మోరియా... 


హే  నువ్వెళ్ళే  దారిలో  కొండొస్తే ... 

వూ  వూ  వూ  హా  వూ  వూ  హ 

అరే  చెకింగ్  అనుకుని  ఎక్కేసుకో ... 

వూ  వూ  వూ  హా  వూ  వూ  హ 

హే  నువ్వెళ్ళే  రూట్  లో  లోయిస్తే ..

అరే  బంగి  జంప్  నే  వాడేసుకో 

హే  సముద్రమొస్తే  నీ  తోవలో ... 

వూ  వూ  వూ  హా  వూ  వూ  హ

అరే  స్విమ్మింగ్  కోసం  ఊసే చేసుకో ... 

వూ  వూ  వూ  హా  వూ  వూ  హ

హే  తూఫాన్  గని  వచ్చిందో 

ఆఆ  స్పీడ్ అంతా   నీలో  నింపేసుకో 


We are from INDIA... With you ma mania

అరే జండా  ఉంచా  రహే  హమారా .. సయ్యూ  సయ్యా


Are you ready for Indian Dance...??


గణపతి  బప్పా  మోరియా...   గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... .గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా... . గణపతి  బప్పా  మోరియా... 

గణపతి  బప్పా  మోరియా...  గణపతి  బప్పా  మోరియా...


పాటల ధనుస్సు


కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా | Krishna Sastri Kavithala | Song Lyrics | Bhagyalakshmi (1983)

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా



చిత్రం : భాగ్యలక్ష్మి (1983)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగూ... ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా

చరణం 1:

కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ...
తెలుగూ....... ఆ ఆ ఆ....
కృష్ణదేవరాయల కీర్తి వెలుగు తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కాకతీయ రాజుల పౌరుషాగ్ని తెలుగూ
కూచిపూడి నర్తన... త్యాగరాజ కీర్తనా
కూచిపూడి నర్తన... త్యాగరాజ కీర్తనా
అడుగడుగు అణువణువూ అచ్చ తెలుగు...
జిలుగు తెలుగు... సంస్కృతికే ముందడుగు
తీపి తీపి తెలుగు... ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా... కృష్ణవేణి పొంగులా

చరణం 2:
పోతులూరి వీరబ్రహ్మ సూక్తులన్ని తెలుగు
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ..
పొట్టి శ్రీరాముల త్యాగనిరతి తెలుగూ
కందుకూరి సంస్కారం... చిలకమర్తి ప్రహసనం
కందుకూరి సంస్కారం... చిలకమర్తి ప్రహసనం
నేటి తరం ముందు తరం అనుసరించు బాట తెలుగు
జాతికిదే బావుటా....
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా
పాలలా... తేనెలా... దేశ భాషలందు లెస్సగా
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
తీపి తీపి తెలుగు ఇది తేట తేట తెలుగూ
కృష్ణ శాస్త్రి కవితలా కృష్ణవేణి పొంగులా

పాటల ధనుస్సు

27, ఆగస్టు 2022, శనివారం

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా | Panthulamma Pantulamma | Song Lyrics | Babul Gadi Debba (1984)

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా



చిత్రం : బాబుల్ గాడి దెబ్బ (1984)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..

ప్రేమ పాఠం వింటావా


పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


చరణం 1 :


పల్లే పట్టు మీద అడపా దడపా రేగి

చిలిపి గుణింతాలు దిద్దుకోనా... దిద్దుకోనా


అందాలలో ఉన్న గ్రంధాలు చదివించి

పై చదువులకు నిన్ను పంపించనా... 

పంపించనా


వయ్యారమే చాలు... ఓనామః

శివమెత్తిపోమాకు... శీవాయః

ఒయ్..ఒయ్..ఒయ్...

వయ్యారమే చాలు... ఓనామః

శివమెత్తిపోమాకు... శీవాయః


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


చరణం 2 :


వాలేపొద్దుల కాడా.. వయసే ముద్దూలాడ

లేతా మనసూ జీతమిచ్చుకోనా.. 

ఇచ్చుకోనా


పండూ ఎన్నెల్లోనా.. ఎండవానల్లోనా

పూతా సొగసు  పట్టి అందుకోనా... 

అందుకోనా


పాఠాలు ఈ పూట చాలోయహా.. 

ఈ దసరాకు సెలవింక లేదోయహా

పాఠాలు ఈ పూట చాలోయహా.. 

ఈ దసరాకు సెలవింక లేదోయహా


పంతులయ్య.. యెయె..


పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..

ప్రేమ పాఠం వింటావా


పాటల ధనుస్సు 


25, ఆగస్టు 2022, గురువారం

కలికి చిలకల కొలికి మాకు మేనత్త | Kaliki chilakala koliki | Song Lyrics | Seetharamayya gari Manavaralu (1991)

 కలికి చిలకల కొలికి మాకు మేనత్త



చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  చిత్ర


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

అత్తమామల కొలుచు అందాల అతివ

పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి


మేనాలు తేలేని మేనకోడల్ని

అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని

వాల్మీకినే మించు వరస తాతయ్య

మాయింటికంపించవయ్య మావయ్యా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


ఆ చేయి యీ చేయి అద్ద గోడలికి

ఆ మాట యీ మాట పెద్ద కోడలికి

నేటి అత్తమ్మా నాటి కోడలివి

తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి

తలలోని నాలికై తల్లిగా చూసే

పూలల్లొ దారమై పూజలే చేసే

నీ కంటి పాపలా కాపురం చేసే

మా చంటిపాపనూ మన్నించి పంపూ


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


మసకబడితే నీకు మల్లెపూదండ

తెలవారితే నీకు తేనె నీరెండ

ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు

ఏడు జన్మలపంట మా అత్త చాలు

పుట్టగానే పూవు పరిమళిస్తుంది

పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది

తెలుసుకో తెలుసుకో తెలుసుకో

తెలుసుకో తెలుసుకో మనసున్న మామ

సయ్యోధ్యనేలేటి సాకేత రామా


కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త

కలవారి కోడలు కనకమాలక్ష్మి


పాటల ధనుస్సు


24, ఆగస్టు 2022, బుధవారం

పూసింది పూసింది పున్నాగ | Poosindi Poosindi | Song Lyrics | Seetharamayya gari Manavaralu (1991)

పూసింది పూసింది పున్నాగ



చిత్రం :  సీతారామయ్యగారి మనవరాలు (1991)

సంగీతం :  కీరవాణి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  చిత్ర



పల్లవి :


పూసింది పూసింది పున్నాగ 

పూసంత నవ్వింది నీలాగ

సందేళలాగేసె సల్లంగా దాని 

సన్నాయి జడలోన సంపెంగ

ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై

ఆడ..... జతులాడ........


పూసింది పూసింది పున్నాగ 

పూసంత నవ్వింది నీలాగ

సందేళలాగేసె సల్లంగా దాని 

సన్నాయి జడలోన సంపెంగ



చరణం 1 :


ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా

అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా


కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే

కలలొచ్చేటి నీ కంటిపాపాయిలే కథ చెప్పాయిలే


అనుకోని రాగమే అనురాగ దీపమై

వలపన్న గానమే ఒక వాయులీనమై

పాడే...... మదిపాడే......



చరణం 2 :


పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా

కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా


అరవిచ్చేటి ఆ భేరిరాగాలకే స్వరమిచ్చావులే

ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే


అల ఎంకి పాటలే ఇల పూలతోటలై

పసిమొగ్గ రేకులే పరువాల చూపులై

పూసే.... విరబూసే......


పాటల ధనుస్సు


23, ఆగస్టు 2022, మంగళవారం

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ | Centureelu kotte | Song Lyrics | Aditya 369 (1991)

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి   



పల్లవి :


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ 



చరణం 1 :


మేఘమాలనంటుకున్న యాంటినాలతో

మెరుపుతీగ మీటి చూడు తందనాలతో

సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో

వలపు వేణువూది చూడు వందనాలతో

చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు తుళ్ళిపడ్డ 

ఈడుజోడు తుఫానులో

కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న కుర్రవాళ్ళ 

ఈలపాట హుషారులో

లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు

ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు

వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ



సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ 



చరణం 2 : 


వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో రెచ్చి 

రాసుకున్నపాటకెన్ని పంక్తులో

విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో 

కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో

ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు 

హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో

కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు 

కమ్ముకున్న కౌగిలింత కధక్కులో

నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా

గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా

పాటలన్ని పూవులైన తోటలాంటి 

లేత యవ్వనాన


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

చాకిరీలనైనా మజా మజావళీలు చేసి

పాడు సోలో ఇంకా ఆడియోలో వీడియోలో 

చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ

బౌండరీలు దాటే మనస్సు మాదీ


పాటల ధనుస్సు 


22, ఆగస్టు 2022, సోమవారం

జాణవులె మృదుపాణివిలె | Janavule Mrudupanivile | Song Lyrics | Aditya 369 (1991)

జాణవులె మృదుపాణివిలె



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జిక్కి, ఎస్. పి. శైలజ  


పల్లవి :

ఆ... ఆ... ఆ.... ఆ.... ఆ...

నెరజాణవులె.. వరవీణవులె కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో...

కన్నులలో... సరసపు వెన్నెలలె..

సన్నలలో ...గుసగుస తెమ్మెరలె

మోవిగని మొగ్గగని.. మోజుపడిన వేళలో..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో... 



చరణం 1 :


మోమటుదాచీ మురిపెము పెంచే లాహిరిలో...

ఆ హ హ ఓ హొ హొ హో

ఊగవుగానే మురళిని వూదే వైఖరిలో..

చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల

చెలి పై యెదలో తుంగ అలా పొంగే ..ఈ వేళ

మరియాదకు విరిపానుపు సవరించవేమిరా..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...

కన్నులలొ సరసపు వెన్నెలలె..

సన్నలలొ గుసగుస తెమ్మెరలె...

మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో... 



చరణం 2 : 


చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో...

ఆ హ హ ఓ హొ హొ హో

వెన్నెల తాపం ...వయసుకు ప్రాణం ఈ చలిలో...

చెలి నారతిలా ..హారతిలా నవ్వాలీవేళ..

తొలి సోయగమే.. ఓ సగము.. ఇవ్వాలీవేళ...

పరువానికి.. పగవానికి.. ఒక న్యాయమింక సాగునా...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...

కన్నులలో సరసపు వెన్నెలలె..

సన్నలలో గుసగుస తెమ్మెరలె...

మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...


పాటల ధనుస్సు 


21, ఆగస్టు 2022, ఆదివారం

రాసలీలవేళ రాయబారమేల | Rasaleela vela | Song Lyrics | Aditya 369 (1991)

రాసలీలవేళ రాయబారమేల



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం :  బాలు, జానకి   



పల్లవి :


రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

రాసలీలవేళ రాయబారమేలా  



చరణం 1 :


కౌగిలింత వేడిలో కరిగే వన్నె వెన్నలా

తెల్లబోయి వేసవి చల్లె పగటి వెన్నెల

మోజులన్నీ పాడగా జాజిపూల జావళి

కందెనేమో కౌగిట అందమైన జాబిలి


తేనెవానలోన చిలికే తీయనైన స్నేహము

మేని వీణలోన..... పలికే సోయగాల రాగము

నిదురరాని కుదురులేని

ఎదలలోని సొదలుమాని 

రాసలీలవేళ రాయబారమేల


చరణం 2 : 


మాయజేసి దాయకు.. సోయగాల మల్లెలు

మోయలేని తీయని హాయి...పూల జల్లులు

చేరదీసి పెంచకు భారమైన యవ్వనం

దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం

చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా

చూపు ముళ్ళు ఓపలేను

కలల తలుపు తీయనా

చెలువ సోకు కలువ రేకు

చలువ సోకి నిలువ నీదు 


రాసలీలవేళ రాయబారమేల

మాటే మౌనమై మాయజేయనేలా

రాసలీలవేళ రాయబారమేలా


పాటల ధనుస్సు 


18, ఆగస్టు 2022, గురువారం

లాలీ లాలి అనురాగం సాగుతుంటే | Lali Lali | Song Lyrics | Indira (1995)

 

లాలీ లాలి అనురాగం సాగుతుంటే

 


చిత్రం : ఇందిర (1995)

సంగీతం :  ఏ ఆర్ రెహమాన్ 

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : హరిణి


లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

 

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుటపడదే

అంతచేదా మరీ వేణుగానం

కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా 

భారమైన మనసా...ఆ

పగటి బాధలన్నీ మరిచిపోవుటకు 

ఉంది కదా ఈ ఏకాంతం వేళా

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

 

ఎటో పోతుంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా

ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా

అన్నీ వైపులా మధువనం మధువనం 

ఎండిపోయెనే ఈ క్షణం

అణువణువునా జీవితం అడియాసకే అంకితం

 

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుటపడదే

అంతచేదా మరీ వేణుగానం

కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా 

భారమైన మనసా...ఆ

పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా 

ఈ ఏకాంతం వేళా

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం


పాటల ధనుస్సు 


 

17, ఆగస్టు 2022, బుధవారం

అత్తమడుగు వాగులోన అత్తకొడకో | Attamadugu vagulona | Song Lyrics | Kondaveeti Simham (1981)

అత్తమడుగు వాగులోన అత్తకొడకో



చిత్రం: కొండవీటి సింహం (1981)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


అత్తమడుగు వాగులోన అత్తకొడకో 

అందమంత తడిసింది అత్తకొడకో

అందం అంతా తడిసింది అత్తకొడకో 

అందమంత తడిసింది అత్తకొడకో

మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో

మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో

గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో ..

గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో


అత్తమడుగు వాగులోన అత్తకూతురో .. 

అందమంతా తడిసిందా అత్తకూతురో

చీ.. ఫో ..

అత్తమడుగు వాగులోన అత్తకూతురో .. 

అందమంతా తడిసిందా అత్తకూతురో

అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో

అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో

కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో .. 

కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో


చరణం 1:


కొత్తూరు ఇది కోడె గిత్తూరిది 

కన్నె ఈడువున్న ఆడాళ్ళ అత్తూరిదీ

ఒత్తిళ్ళివి ప్రేమ పొత్తిళ్ళివి 

పెళ్ళికానోళ్ళకి అందాక అత్తిళ్ళివి

అల్లుడల్లే ఆల్లుకోకు అప్పుడే

కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే

అల్లుడల్లే ఆల్లుకోకు అప్పుడే ..

కోడలల్లే రెచ్చిపోకు ఇప్పుడే

కౌగిలింతలోనె నువ్వు ఇల్లు కట్టుకో

పడుచు వన్నె పడకటింటి తలుపు తీసుకో..


అందం అంతా తడిసింది అత్తకొడకో 

అందమంతా తడిసిందా అత్తకూతురో

మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో 

అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో

గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో 

కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో


చరణం 2:


పొత్తూరిది పిల్ల పొందూరిది అరే.. 

చెయ్యేస్తే అందాలు చిందూరిది

గిల్లూరిది నాకు పెళ్ళూరు ఇది 

ముద్దు మురిపాల నా మూడు ముళ్ళూరిది

కన్నెసోకు కట్నమిచ్చినప్పుడే... 

ఆ కట్నమేదో నువ్వు తేల్చినప్పుడె...

కన్నెసోకు కట్నం ఇచ్చినప్పుడే .. 

ఆ కట్నమేదో నువ్వు తేల్చినప్పుడె...

కలవరింతలు అన్ని నాకు కౌలికి ఇచ్చుకో

చిలిపి తలపు వలపు నాకు సిస్తు కట్టుకో ...


అత్తమడుగు వాగులోన అత్తకూతురో 

అందం అంతా తడిసింది అత్తకొడకో

అడిగింది ఇచ్చుకో ఇచ్చింది పుచ్చుకో 

మెత్తంగ హత్తుకో వెచ్చంగ ఆదుకో

కౌగిట్లో సోకులన్ని కాపు కాచుకో 

గుత్తంగ సోకులన్ని సొమ్ము చేసుకో


పాటల ధనుస్సు 


15, ఆగస్టు 2022, సోమవారం

పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది | Pilla Vundi | Song Lyrics | Kondaveeti Simham (1981)

పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది



చిత్రం: కొండవీటి సింహం (1981) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


పిల్ల ఉంది పిల్లమీద కోరికుంది 

చెప్పబోతే జారుకుంది 

దానికెట్టా పంపేది గుట్టు కబురు 

దానికెట్టా తెలిపేది గుండే గుబులు 

పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు 


హోయ్! వేటాగాడు పేటాకంతా నీటుగాడు 

వాటమైన వన్నెకాడు 

వాడికెట్టా పంపేది గాలి కబురు 

పంపలేక వేగింది చింత చిగురు 

పాడు ఈడు గోడదిగే పట్టపగలు 


పిల్లఉంది పిల్లమీద కోరికుంది 

చెప్పబోతే జారుకుంది 


చరణం 1: 


నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క .. 

ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 

నిబ్బరంగ ఉన్నాది కన్నె చుక్క .. 

ఉబ్బరాల మీదుంది జున్ను ముక్క 

దాన్ని చూసి .. దాని సోకు చూసి 

దాన్ని చూసి .. దాని సోకు చూసి 

చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 

చిటుకుమంటు కొట్టుకుంది చిలిపి కన్ను 

పుటక దాటి పట్టుకుంది వలపు నన్ను .. అర్రర్రే...


ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను అయ్యో.. 

ఓపరాల ఈడునింక ఆపలేను 

ఒంటిగున్న ఒంటిబాధ ఓపలేను ఆహ.. 

ఓపరాల ఈడునింక ఆపలేను 

వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు 

వాడికెట్ట చెప్పేది ఒంటి గుట్టు 

ఎట్ట నేను ఆపేది ఇంత పట్టు 


పిల్లఉంది పిల్లమీద కోరికుంది 

చెప్పబోతే జారుకుంది 

వేటాగాడు పేటాకంతా నీటుగాడు 

వాటమైన వన్నెకాడు 



జంట లేని ఇంటి పట్టునుండలేను .. అయ్యో 

కొంటె టేనే తీపరాలు టాపలేను .. పాపం 

జంటా లేని ఇంటి పట్టునుండలేను .. అహా..

కొటె టేనే తీపరాలు టాపలేను .. చొచ్చో 

డికెట్ట సెప్పేది గుండె గుట్టు .... 

వాడికెట్ట సెప్పేది గుండె గుట్టు .. 

ఏట్టా నాకు తప్పేది గుట్టుమట్టు..


చరణం 2: 


చెంప గిల్లి పోతాది వాడి చూపు .. 

చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 

చెంప గిల్లి పోతాది వాడి చూపు .. 

చెమ్మగిల్లి పోతాది వేడి నాకు 

వాడ్ని చూసి .. వాడి రాక చూసి 

వాడ్ని చూసి .. వాడి రాక చూసి 

లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 

లటుకుమంటు కొట్టుకొంది చిలక ముక్కు 

పండు దోచుకోనులేదు నాకు దిక్కు 


గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే 

అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 

గొగ్గిలాల గుమ్మసోకు సూడకుంటే 

అగ్గిలాంటి ఈడు నాకు భగ్గుమంటే 

దానికెట్టా సెప్పేది లోని గుట్టు... 

దానికెట్టా సెప్పేది లోని గుట్టు .. 

ఎట్టా నాకు దక్కేది తేనెపట్టు..


హోయ్! వేటాగాడు పేటాకంతా నీటుగాడు 

వాటమైన వన్నెకాడు 

వాడికెట్టా పంపేది గాలి కబురు 

పంపలేక వేగింది చింత చిగురు 

పాడు ఈడు గోడదిగే పట్టపగలు 

పిల్లఉంది పిల్లమీద కోరికుంది 

చెప్పబోతే జారుకుంది 

దానికెట్టా పంపేది గుట్టు కబురు 

దానికెట్టా తెలిపేది గుండే గుబులు 

పూతపట్టి కూతకొచ్చె పిట్ట వగలు


పాటల ధనుస్సు