22, ఆగస్టు 2022, సోమవారం

జాణవులె మృదుపాణివిలె | Janavule Mrudupanivile | Song Lyrics | Aditya 369 (1991)

జాణవులె మృదుపాణివిలె



చిత్రం :  ఆదిత్య 369 (1991)

సంగీతం :  ఇళయరాజా

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, జిక్కి, ఎస్. పి. శైలజ  


పల్లవి :

ఆ... ఆ... ఆ.... ఆ.... ఆ...

నెరజాణవులె.. వరవీణవులె కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో...

కన్నులలో... సరసపు వెన్నెలలె..

సన్నలలో ...గుసగుస తెమ్మెరలె

మోవిగని మొగ్గగని.. మోజుపడిన వేళలో..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో... 



చరణం 1 :


మోమటుదాచీ మురిపెము పెంచే లాహిరిలో...

ఆ హ హ ఓ హొ హొ హో

ఊగవుగానే మురళిని వూదే వైఖరిలో..

చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల

చెలి పై యెదలో తుంగ అలా పొంగే ..ఈ వేళ

మరియాదకు విరిపానుపు సవరించవేమిరా..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...

కన్నులలొ సరసపు వెన్నెలలె..

సన్నలలొ గుసగుస తెమ్మెరలె...

మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో... 



చరణం 2 : 


చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో...

ఆ హ హ ఓ హొ హొ హో

వెన్నెల తాపం ...వయసుకు ప్రాణం ఈ చలిలో...

చెలి నారతిలా ..హారతిలా నవ్వాలీవేళ..

తొలి సోయగమే.. ఓ సగము.. ఇవ్వాలీవేళ...

పరువానికి.. పగవానికి.. ఒక న్యాయమింక సాగునా...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...

కన్నులలో సరసపు వెన్నెలలె..

సన్నలలో గుసగుస తెమ్మెరలె...

మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో 

ఆ హ హ

జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి