18, ఆగస్టు 2022, గురువారం

లాలీ లాలి అనురాగం సాగుతుంటే | Lali Lali | Song Lyrics | Indira (1995)

 

లాలీ లాలి అనురాగం సాగుతుంటే

 


చిత్రం : ఇందిర (1995)

సంగీతం :  ఏ ఆర్ రెహమాన్ 

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : హరిణి


లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

 

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుటపడదే

అంతచేదా మరీ వేణుగానం

కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా 

భారమైన మనసా...ఆ

పగటి బాధలన్నీ మరిచిపోవుటకు 

ఉంది కదా ఈ ఏకాంతం వేళా

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

 

ఎటో పోతుంది నీలిమేఘం వర్షం మెరిసిపోదా

ఏదో అంటుంది కోయిల శోకం రాగం మూగపోగా

అన్నీ వైపులా మధువనం మధువనం 

ఎండిపోయెనే ఈ క్షణం

అణువణువునా జీవితం అడియాసకే అంకితం

 

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు 

హృదయం కుదుటపడదే

అంతచేదా మరీ వేణుగానం

కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా 

భారమైన మనసా...ఆ

పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా 

ఈ ఏకాంతం వేళా

లాలీ లాలి అనురాగం సాగుతుంటే 

ఎవరూ నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్న ప్రాణం


పాటల ధనుస్సు 


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి