రాసలీల నృత్యము
గీత రచన : రామకృష్ణ దువ్వు
స్వర కల్పన : S వేణుమాధవ్,
ఆల్బం : బృందావనం
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
పల్లవి:
శారద చంద్రికలు మరులను కురిపించే
గువ్వలన్ని గూడుచేరి రాసలీలకై వేచే
విరహంలో వేగిపోయి వేంచేసిన చెలులారా
గోవిందుని పదములకు తనువులూగిపోగా
రాసలీల నాట్యమాడ రస జగమే ఓలలాడు
చరణం:
నిశ్శబ్ధ నిశీధిలో జగమే సోలినది
శ్రమియించి ధరియిత్రి నిద్రలో వాలినది
పున్నమి జాబిలికై కలువ కన్నెలు
వన్నెలెన్నో విరబూసి నాట్యమే ఆడాయి
తరుణుల సోయగాలు పిల్లనగ్రోవి చేసి
మురళీధరుని వేలికొసలు మీటగా
మధురమైన గానము కంఠాన పలికింది
చరణం:
తమకపు తనువులు బరువుగ మారెను
ఆతని కౌగిలిలో ఎదలే పొంగెను
ఫాలము మొదలుకొని చరణాల వరకు
అణువు అణువు నల్లనయ్య స్పర్శ కోసం
పరితపించి పోయాయి.. పరవశించాయి
శ్రీకృష్ణ భావనలో తనువులు మనసులు
అర్పించే భాగ్యమే రాసలీల నృత్యము
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి