15, ఏప్రిల్ 2022, శుక్రవారం

చిలిపినవ్వుల నిను చూడగానే | Chilipi Navvula | Song Lyrics | Atmeeyulu (1969)

చిలిపినవ్వుల నిను చూడగానే



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


చిలిపినవ్వుల నిను చూడగానే...

వలపు పోంగేను నాలోనే...

వలపు పోంగేను నాలోనే


ఎన్ని జన్మల పుణ్యాలఫలమో..

నిను నే చేరుకున్నాను...

నిను నే చేరుకున్నాను


చరణం 1:


చూపుల శృంగారమోలికించినావు ఆ..ఆ..ఆ..ఆ

చూపుల శృంగారమోలికించినావు...

మాటల మధువెంతో చిలికించినావు

వాడని అందాల ....వీడని బంధాల...

తోడుగ నడిచేములే


చిలిపినవ్వుల నిను చూడగానే...

వలపు పోంగేను నాలోనే...

వలపు పోంగేను నాలోనే


ఎన్ని జన్మల పుణ్యాలఫలమో..

నిను నే చేరుకున్నాను...

నిను నే చేరుకున్నాను


చరణం 2:


అహ..హ..హ..ఆ......ఓ...ఓ...ఓ..

నేను నీదాననే ..నీవు నా వాడవే..

నను వీడి పోలేవులే...

కన్నుల ఉయ్యాలలూగింతునోయి...

కన్నుల ఉయ్యాలలూగింతునోయి....

చూడని స్వర్గాలు చూపింతునోయి

తియ్యని సరసాల.. తీరని సరదాల...

హాయిగ తేలేములే...


ఎన్ని జన్మల పుణ్యాలఫలమో..

నిను నే చేరుకున్నాను...

నిను నే చేరుకున్నాను


చిలిపినవ్వుల నిను చూడగానే...

వలపు పోంగేను నాలోనే...

వలపు పోంగేను నాలోనే....


అహ...హ..ఆ..అ..ఆ...


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి