29, మార్చి 2026, ఆదివారం

పయనించే ఓ చిలుకా ఎగిరిపో | Payaninche O Chiluka | Song Lyrics | Kula Daivam (1960)

పయనించే ఓ చిలుకా ఎగిరిపో


చిత్రం: కులదైవం (1960) 

సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

గీతరచయిత: సముద్రాల (జూ) 

నేపధ్య గానం: ఘంటసాల 


పల్లవి: 


పయనించే..ఓ..ఓ.. ఓ... చిలుకా ... 

ఆ...ఆ....ఆ....ఆ...ఆ... 

పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా 

ఆ...ఆ...ఆ...ఆ... 


చరణం 1: 


పుల్ల పుడక ముక్కున కరచి...

గూడును కట్టితివోయి 

పుల్ల పుడక ముక్కున కరచి...

గూడును కట్టితివోయి 

వానకు తడిసిన నీ బిగి రెక్కలు...

ఎండకు ఆరినవోయి 

ఫలించ లేదని చేసిన కష్టం..

మదిలో వేదన వలదోయి 

ఫలించ లేదని చేసిన కష్టం..

మదిలో వేదన వలదోయి 

రాదోయి సిరి నీ వెను వెంట..

త్యాగమే నీ చేదోడు 


పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా 

ఆ...ఆ...ఆ...ఆ.. 


చరణం 2: 


తీరెను రోజులు నీకీ కోమ్మకు...

కోమ్మా ఈ గూడు వదలి 

తీరెను రోజులు నీకీ కోమ్మకు...

కోమ్మా ఈ గూడు వదలి 

ఎవరికి వారే ఏదోనాటికి...

ఎరుగము ఎటకో ఈ బదిలీ 

మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..

ఈ లోకంలో మన మజిలీ 

మూడు దినాల ముచ్చటయే..ఏ..ఏ..

ఈ లోకంలో మన మజిలీ 

నిజాయితీగా ధర్మపథాన... 

నిజాయితీగా ధర్మపథాన....

ధైర్యమే నీ తోడు 


పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా 

ఆ...ఆ...ఆ...ఆ.. 


చరణం 3: 


మరవాలి నీ కులుకుల నడలే...

మదిలో నయగారాలే 

మరవాలి నీ కులుకుల నడలే...

మదిలో నయగారాలే 

తీరని వేదన తీయని ముసుగే...

శిరస్సున శింగారాలే.... 

ఓర్వలేని ఈ జగతికి నీ పై...ఈ..ఈ.. 

ఓర్వలేని ఈ జగతికి నీ పై...

లేవే కనికారాలే 

కరిగి కరిగి కన్నీరై... 

కరిగి కరిగి కన్నీరై...

కడతేరుటే నీ తల వ్రాలి 


పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా 


చరణం 4: 


గోడుమని విలపించేరే ...

నీ గుణము తెలిసిన వారు 

గోడుమని విలపించేరే ...

నీ గుణము తెలిసిన వారు 

జోడుగ నీతో ఆడీ పాడీ...

కూరుములాడిన వారు 

ఏరులైయే కన్నీరులతో...

మనసారా దీవించేరే 

ఎన్నడో తిరిగి ఇటు నీ రాకా...

ఎవడే తెలిసిన వారు 


పయనించే ఓ చిలుకా...ఎగిరిపో..

పాడైపోయెను గూడు... 

పయనించే ఓ చిలుకా 

ఆ...ఆ...ఆ...ఆ...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి