21, ఫిబ్రవరి 2026, శనివారం

నిజమైనా కలయైనా | Nijamaina Kala ayina | Song Lyrics | Mooga Nomu (1969)

నిజమైనా... కలయైనా


చిత్రం :  మూగనోము (1969)

సంగీతం :  ఆర్. గోవర్ధన్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


నిజమైనా... కలయైనా... 

నిరాశలో.. ఒకటేలే

పగలైనా రేయైనా 

ఎడారిలో ఒకటేలే...


నిజమైనా... కలయైనా... 

నిరాశలో ఒకటేలే...ఒకటేలే


చరణం 1 :


పదే పదే ఎవరినో 

పరాకుగా పిలిచేను

పదే పదే ఎవరినో 

పరాకుగా పిలిచేను

నా నీడే నా తోడై 

జగమంతా తిరిగేను


నిజమైనా... కలయైనా... 

నిరాశలో.. ఒకటేలే

పగలైనా రేయైనా 

ఎడారిలో ఒకటేలే...ఒకటేలే


చరణం 2 :


గులాబినై నీ జడలో 

మురిసానే ఆ నాడు

గులాబినై నీ జడలో 

మురిసానే ఆ నాడు

బికారినై నీ కోసం 

వెతికానే ఈనాడు


నిజమైనా... కలయైనా... 

నిరాశలో.. ఒకటేలే

పగలైనా రేయైనా 

ఎడారిలో ఒకటేలే....ఒకటేలే


చరణం 3 :


చెలి చెలి నా మదిలో 

చితులెన్నో రగిలేను

చెలి చెలి నా మదిలో 

చితులెన్నో రగిలేను

చెలిలేని నాకేమో 

విషాదమే మిగిలేను


నిజమైనా... కలయైనా... 

నిరాశలో.. ఒకటేలే

పగలైనా రేయైనా 

ఎడారిలో ఒకటేలే....ఒకటేలే


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి