31, జనవరి 2026, శనివారం

అలుకమానవే చిలుకలకొలికిరో | Alukamanave Chilakala Kolikiro | Song Lyrics | Srikrishna Satya (1971)

అలుకమానవే చిలుకలకొలికిరో


చిత్రం : శ్రీకృష్ణ సత్య (1971)

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు  

గీతరచయిత : పింగళి నాగేంద్రరావు

నేపథ్య గానం : ఘంటసాల, జానకి  


పల్లవి :


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


దారి తప్పి ఇటు చేరితివా... 

నీ దారి చూసుకోవోయి...

నా దరికి రాకు... రాకోయి..


చరణం 1 :


కూరిమి కలిగిన తరుణివి నీవని... 

తరుణమునెరిగియే చేరితినే

కూరిమి కలిగిన తరుణివి నీవని.. 

తరుణమునెరిగియే చేరితినే

నీ నెరినెరి వలపునే కోరితినే...

నీ నెరినెరి వలపునే వేడితినే... 


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


చరణం 2 :


చేసిన బాసలు చెల్లించని 

భల్ మోసగావేవోయి...

చేసిన బాసలు చెల్లించని 

భల్ మోసగావేవోయి...

ఇక ఆశ లేదు లేదోయి...

ఇక ఆశ లేదు పోవోయి...


దాసుని నేరము దండంతో సరి... 

బుసలు మాని ఓ వగలాడి...

దాసుని నేరము దండంతో సరి... 

బుసలు మాని ఓ వగలాడి.

నా సరసకు రావే సరసాంగి...

నా సరసకు రావే లలితాంగి...


అలుకమానవే చిలుకలకొలికిరో... 

తలుపు తీయవే ప్రాణసఖి...

తలుపు తీయవే ప్రాణసఖి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి