9, డిసెంబర్ 2025, మంగళవారం

యమహో నీ యమ యమ అందం | Yamaho Yamayama Andam | Song Lyrics | Jagadekaveerudu Atiloka Sundari (1990)

యమహో నీ యమ యమ అందం


చిత్రం: జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: బాలు, జానకి 


పల్లవి : 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం 

పోజుల్లో నేను యముడంత వాడ్ని 

మోజుల్లో నీకు మొగుడంటి వాడ్ని 

అల్లారు ముద్దుల్లో గాయం 

విరబూసింది పువ్వంటి ప్రాయం 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం 


చరణం 1 : 


నల్లని కాటుక పెట్టి 

గాజులు పెట్టి గజ్జా కట్టి 

గుట్టుగా సెంటే కొట్టి 

వడ్డాణాలే ఒంటికి పెట్టి 

తెల్లని చీర కట్టి 

మల్లెలు చుట్టి కొప్పున పెట్టీ 

పచ్చని పాదాలకి 

ఎర్రని బొట్టు పారాణెట్టి 

చీకటింతా దీపమెట్టి 

చీకుచింత పక్కానెట్టి 

నిన్ను నాలో దాచిపెట్టి 

నన్ను నీకు దోచిపెట్టి 


పెట్టూపోతా వద్దే చిట్టెంకి 

చెయి పట్టిన్నాడే కూసే వల్లంకి 

పెట్టేది మూడే ముళ్ళమ్మి 

నువ్వు పుట్టింది నాకోసమమ్మి 

ఇక నీ సొగసు నా వయసు 

పేనుకొనే ప్రేమలలో 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 


చరణం 2 : 


పట్టె మంచమేసిపెట్టి 

పాలు పెట్టి పండు పెట్టి 

పక్క మీద పూలు కొట్టి 

పక్కా పక్కాలొళ్ళో పెట్టి 

ఆకులో వక్క పెట్టి 

సున్నాలెట్టి చిలకా చుట్టి 

ముద్దుగా నోట్లో పెట్టి 

పరువాలన్ని పండాపెట్టి 

చీర గుట్టు సారే పెట్టి 

సిగ్గులన్ని ఆరాబెట్టి 

కళ్ళలోన వత్తులెట్టి 

కౌగిలింత మాటు పెట్టి 


ఒట్టే పెట్టి వచ్చేసాక మామా 

నిను ఒళ్ళో పెట్టి లాలించేదే ప్రేమా 

చుట్టెయ్యి సందె సీకట్లోనా 

నను కట్టెయ్యి కౌగిలింతల్లోనా 

ఇక ఆ గొడవ ఈ చొరవ 

ఆగవులే అలజడిలో 


యమహో నీ యమ యమ అందం 

చెలరేగింది ఎగా దిగా తాపం 

నమహో నీ ఝమ ఝమ వాటం 

సుడి రేగింది ఎడా పెడా తాళం


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి