31, డిసెంబర్ 2025, బుధవారం

పూజకు వేళాయెరా | Poojaku Velayera | Song Lyrics | Bhakta Tukaram (1973)

పూజకు వేళాయెరా


చిత్రం : భక్త తుకారాం (1973)

సంగీతం : ఆదినారాయణరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి :


పూజకు వేళాయెరా...

రంగపూజకు వేళాయెరా... ఆ...

పూజకు వేళాయెరా...


అనుపల్లవి :


ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో

ఇన్నినాళ్లు నే నెటుల వేచితినో

ఎన్ని రేలు ఎంతెంత వేగితినో


పిలుపును విని విచ్చేసితివని

నా పిలుపును విని విచ్చేసితివని

వలపులన్నీ నీ కొరకె దాచితిని    

వలపులన్నీ నీ కొరకె దాచితిని

ఎవరూ పొందని ఏకాంతసేవలో...

ఈవేళ తమిదీరగా నిన్నె అలరించు...

పూజకు వేళాయె...

పూజకు వేళాయెరా...


చరణం 1 :


ఈ నీలినీలి ముంగురులు... 

ఇంద్రనీలాల మంజరులు

ఈ వికసిత సిత నయనాలు... 

శతదళ కోమల కమలాలు

అరుణారుణమీ అధరము... 

తరుణమందార పల్లవము

ఎదలో పొంగిన ఈ రమణీయ 

పయోధరాలు...

పాలకడలిలో ఉదయించు 

సుధాకలశాలు...

ఎంత సుందరము 

శిల్ప బంధురము

ఈ... జఘన మండలము...

సృష్టినంతటిని దాచుకున్న 

ఆ పృథివీ మండలము


ఓ... అభినవ సౌందర్యరాశీ...

ఓ... అపూర్వ చాతుర్యమూర్తీ...

నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

 నీ కటాక్షముల లాలనమ్ములో...

నీ మధురాధర చుంబనమ్ములో...

మధురిమలెన్నో పొదుగుకున్న

నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో....

అప్రమేయ దివ్యానందాలను 

అందించే నీ చల్లని ఒడిలో

హాయిగా నిదురించ గలిగే...

పాపగా నీ కడుపున 

జన్మించు భాగ్యమే

లేదాయె తల్లీ... తల్లీ.... తల్లీ...


స్వామీ....

అవునమ్మా నీవు ప్రదర్శించిన

సౌందర్యం అనిత్యం

నీవు నమ్ముకున్న 

యవ్వనం అశాశ్వతం..


దువ్వుకున్న ఆ నీలిముంగురులె 

దూదిపింజలై పోవునులే

నవ్వుతున్న ఆ కంటి వెలుగులే 

దివ్వెల పోలిక ఆరునులే

వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే 

వాడి వక్కలై పోవునులే

పాలుపొంగు ఆ కలశాలే 

తోలుతిత్తులై పోవునులే

నడుము వంగగా నీ ఒడలు కుంగగా...

నడుము వంగగా ఒడలు కుంగగా...

నడువలేని నీ బడుగు జీవితం... 

వడవడ వణకునులే

ఆశలు రేపే సుందర దేహము 

అస్థిపంజరంబౌనులే...


పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి ..

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

పాండురంగ హరి జైజై..

పాండురంగ హరి

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 

విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ


విఠల విఠల పాండురంగ... 

విఠల విఠల పాండురంగ 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి