29, డిసెంబర్ 2025, సోమవారం

అందాల నా రాజ అలుకేలరా | Andala Naaraja Alukelara | Song Lyrics | Mangamma Sapatham (1965)

అందాల నా రాజ అలుకేలరా



చిత్రం :  మంగమ్మ శపధం (1965)

సంగీతం :  టి.వి. రాజు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  పి.సుశీల 


పల్లవి:


అందాల నా రాజ అలుకేలరా.. 

ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ..

అందాల నా రాజ అలుకేలరా.. 

ఔననీ.. కాదని అనవేలరా..ఆ..ఆ..

అందాల నా రాజ అలుకేలరా.. 

ఆ..ఆ..ఆ..ఆ..


చరణం 1:


చందురుడాపైన సందడి చేసేను.. 

డెందములోలోన తొందర చేసేను..

అందని వలపులు గంధము పూసేను..

ఆ..ఆ..ఆ..

అందని వలపులు గంధము పూసేను.. 

సుందరి జాలిగ చూసేనురా..ఆ..

అందాల నా రాజ అలుకేలరా...ఆ


చరణం 2:


మరులను చిలికించు చిరునవ్వులేమాయే..

మనసును కవ్వించు కనుసన్నలేమాయే..

మదనుని తూపులు మరి మరి పదునాయే..

ఆ..ఆ..ఆ..

మదనుని తూపులు మరి మరి పదునాయే.. 

మౌనము చాలించి నన్నేలరా..ఆ..

అందాల నా రాజ అలుకేలరా.. 

ఔననీ.. కాదని అనవేలరా..

అందాల నా రాజ అలుకేలరా.. 

ఆ..ఆ..ఆ..ఆ..


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి