4, అక్టోబర్ 2025, శనివారం

విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి | Virisina Sirimalli | Song Lyrics | Bangaru Chellelu (1979)

విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి 



చిత్రం : బంగారు చెల్లెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు 


పల్లవి :


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి



చరణం 1 :


రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... 

అన్నయ్య అన్నాడు అది తగదని

రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని... 

అన్నయ్య అన్నాడు అది తగదని


రాయబారమంపింది రా రమ్మని.... 

రాయబారమంపింది రా రమ్మని

పెళ్ళాడి వెళ్ళింది దొంగదారిని... 


నా చెల్లెలే రుక్మిణైతే... 

రానిస్తానా ఆ గతిని

కాళ్ళు కడిగి తెస్తాను...  

తాను కోరుకున్నవాడిని


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


చరణం 2 :


కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...

కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి

కైక లేని రాముడు నీ కరమును పట్టాలి...

కానకెళ్లకే లవకుశులు నీ కడుపున పుట్టాలి 


రామా రామా అన్న కవలలు 

మామా మామా అని పిలవాలి

రామా రామా అన్న కవలలు 

మామా మామా అని పిలవాలి


అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు

 అక్షితలవ్వాలి

అన్నయ్య కన్నుల ఆనందాశ్రువులు 

అక్షితలవ్వాలి


విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


చరణం 3 :


అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... 

అన్నెంపున్నెం ఎరుగని తల్లి

అన్నే అమ్మగ పెరిగిన చెల్లి... 

అన్నెంపున్నెం ఎరుగని తల్లి


కన్నతల్లి కాంచిన కలలీ 

అన్నయ్య కంటికి రావాలి

కన్నతల్లి కాంచిన కలలీ 

అన్నయ్య కంటికి రావాలి


అవి అన్నీ పండాలి... 

నా పండుగ కావాలి

అవి అన్నీ పండాలి... 

నా పండుగ కావాలి


పాలవెల్లి పుట్టిన తల్లి... నా చెల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి

విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి