పసుపు కుంకుమ తెస్తాడు
చిత్రం : బంగారు చెల్లెలు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి సుశీల
పల్లవి :
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
పట్టిన చేయి విడవని రాజుకు..
పట్టపు రాణిని ఔతాను
పట్టిన చేయి విడవని రాజుకు..
పట్టపు రాణిని ఔతాను
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
చరణం 1 :
మబ్బులలోనా దాగున్నా...
మచ్చే ఎరుగని చెందురుడు
మబ్బులలోనా దాగున్నా...
మచ్చే ఎరుగని చెందురుడు
మమతల వెన్నెల కురిపిస్తాడు...
మనుగడ పున్నమి చేస్తాడు
మమతల వెన్నెల కురిపిస్తాడు...
మనుగడ పున్నమి చేస్తాడు
అహహ...ఆ... ఆ... అహహాహా...
ఆ... ఆ... ఆ...
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
చరణం 2 :
నా నీడనే నేను వెతికాను...
ఆ జాడ తెలియక నిలిచాను
నా నీడనే నేను వెతికాను...
ఆ జాడ తెలియక నిలిచాను
పిచ్చిప్రేమకు కళ్ళే లేవని
పెద్దలు అన్నది నిజమేను
పిచ్చిప్రేమకు కళ్ళే లేవని
పెద్దలు అన్నది నిజమేను
అహహ...ఆ... ఆ... అహహాహా...
ఆ... ఆ... ఆ...
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
పట్టిన చేయి విడవని రాజుకు..
పట్టపు రాణిని ఔతాను
పసుపు కుంకుమ తెస్తాడు
నా బ్రతుకు పచ్చగా చేస్తాడు
ఆ.... ఆ... ఆ... ఆ... ఆ...
ఉహ్మ్మ్... ఉహ్మ్... ఉహ్మ్....
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి