4, అక్టోబర్ 2025, శనివారం

మన్ని౦చుమా ప్రియ | Manninchuma Priya | Song Lyrics | Naa Pere Bhagavan (1976)

మన్ని౦చుమా ప్రియ



చిత్రం : నా పేరే భగవాన్ (1976)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : సుశీల


పల్లవి :


మన్ని౦చుమా ప్రియా 

మన్నించుమా

మరుమల్లె నల్లగా ఉంటే.. 

చిరునవ్వు చేదుగా ఉంటే

ఆ తప్పు నాది కాదంటే . . 

మన్ని౦చుమా ప్రియా 

మన్నించుమా


చరణం 1 :


నా కంటి కులుకులలోన.. 

నీ కలలు చెదురుతు వుంటే

నా కాలి చిందులలోన.. 

నీ గుండె నలుగుతు వుంటే

సగము రేయి రగలిపోయి.. 

సెగలు గా మారిపోతుంటే


ఆ తప్పు నాది కాదంటే.. 

మన్ని౦చుమా ఆ ఆ

మన్ని౦చుమా ప్రియా 

మన్నించుమా  


చరణం 2 :


ఆలనాటి బాసలన్నీ 

సెలఏటి రాతలైతే

కుసుమించు ఆశలన్నీ 

వసివాడి రాలిపోతే

పెదవి వణికీ మధువు తోణికీ 

హృదయమే తూలి పొతుంటే 


ఆ తప్పు నాది కాదంటే..

మన్ని౦చుమా.. ఆ.. ఆ.. ఆ

మన్ని౦చుమా ప్రియా 

మన్నించుమా  


మరుమల్లె నల్లగా ఉంటే.. 

చిరునవ్వు చేదుగా ఉంటే

ఆ తప్పు నాది కాదంటే.. 

మన్ని౦చుమా ప్రియా 

మన్నించుమా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి