హలో హలో ఓ అమ్మాయి
చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
హలో హలో ఓ అమ్మాయి
పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచే
వేడుకొనడు అబ్బాయి
ఓహొ బడాయి చాలోయి
కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకంలో
ఆడవారిది పై చేయి
చరణం 1:
నిజా నిజాలు తెలియకనే
నిందవేసే పొరపాటు
నిజా నిజాలు తెలియకనే
నిందవేసే పొరపాటు
నాటికీ నేటికీ మీకు
అలవాటే
హలో హలో ఓ అమ్మాయి
అవును మీదే పై చేయి
చరణం 2:
బెట్టు చేసే మగవారి
గుట్టు మాకు తెలుసోయి
బెట్టు చేసే మగవారి
గుట్టు మాకు తెలుసోయి
మనసులో మమతలూ
పైకి వేషాలూ
ఓహొ బడాయి చాలోయి
కోతలెందుకు పోవోయి
చరణం 3:
లడాయి చేసే స్త్రీ జాతి
రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీ జాతి
రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు..
గెలుపు కోసం మగవారు
కాళ్ళ బేరము లాడకపోరు
ఓహొ బడాయి చాలోయి
కోతలెందుకు పోవోయి
హలో హలో ఓ అమ్మాయి
అందుకొనుమా నా గుడ్ బై
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి