26, అక్టోబర్ 2025, ఆదివారం

ఏమనుకున్నావూ? Emanukunnavu | Song Lyrics | Bangaru Babu (1973)

ఏమనుకున్నావూ?  నన్నేమనుకున్నావూ?


చిత్రం : బంగారు బాబు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి :


ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా..  

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?

ఏమనుకున్నావూ?..  

నన్నేమనుకున్నావూ?


చరణం 1 :


వెళ్ళినట్టె వెళ్ళావూ.. 

కళ్ళలోనె ఉన్నావూ

మరచిపోను వీలులేక.. 

మనసులోనె మెదిలావూ

వెళ్ళినట్టె వెళ్ళావూ.. 

కళ్ళలోనె ఉన్నావూ

మరచిపోను వీలులేక.. 

మనసులోనె మెదిలావూ


పిచ్చివాడి ననుకున్నావా?..  

బిచ్చగడి ననుకున్నావా?  

ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా? .. 

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?


చరణం 2 :


నిన్నునేను రమ్మన్నానా?..  

మనసు నాకు ఇమ్మన్నానా?

వచ్చి వలపు రగిలించావూ..  

చిచ్చునాకు మిగిలించావూ

నిన్నునేను రమ్మన్నానా?..  

మనసు నాకు ఇమ్మన్నానా?

వచ్చి వలపు రగిలించావూ..  

చిచ్చునాకు మిగిలించావూ

పిచ్చివాడి ననుకున్నావా? 

బిచ్చగడి ననుకున్నావా?     

    

ఏమనుకున్నావూ? ..  

నన్నేమనుకున్నావూ?

పిచ్చివాడి ననుకున్నావా?.. 

ప్రేమ బిచ్చగాడి ననుకున్నావా?


చరణం 3 :


ప్రేమంటేనే బాధన్నారూ.. 

ఆ బాధుంటేనే బ్రతుకన్నారూ

అది ప్రేమే కాదంటాను.. 

ఆ బ్రతుకే వద్దంటాను

అది ప్రేమే కాదంటాను.. 

ఆ బ్రతుకే వద్దంటాను  

ఏమనుకున్నావూ? .. 

నన్నేమనుకున్నావూ?


- పాటల ధనుస్సు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి