18, అక్టోబర్ 2025, శనివారం

భవ హరణా శుభ చరణా | Bhavaharana Shubhacharana | Song Lyrics | Mallamma Katha (1973)

భవ హరణా... శుభ చరణా



చిత్రం :  మల్లమ్మ కథ (1973)

సంగీతం :  ఎస్. పి. కోదండపాణి

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  పి. సుశీల


పల్లవి : 


భవ హరణా...  శుభ చరణా.. 

నాగా భరణా.. గౌరీ రమణా

భవ హరణా.. శుభ చరణా.. 

నాగా భరణా..  గౌరీ రమణా

దిక్కేలేనీ దీనులపాలిట.. 

దిక్కై నిలిచిన దేవుడవయ్యా  

భవ హరణా...  శుభ చరణా.. 

నాగా భరణా.. గౌరీ రమణా


చరణం 1:


నీ భక్తులకు పెన్నిది నీవే.. 

మా కన్నులలో ఉన్నది నీవే

నీ భక్తులకు పెన్నిది నీవే.. 

మా కన్నులలో ఉన్నది నీవే

నిండుమనసుతో  నీవారొసగే..

నిండుమనసుతో  నీవారొసగే... 

గరిక పూలకే మురిసేవయ్యా

కన్నీటితోనే పూజించగానే... 

పన్నీరుగానే భావింతువయ్యా


భవ హరణా...  శుభ చరణా.. 

నాగా భరణా.. గౌరీ రమణా


చరణం 2 :


నంది వాహనం ఉందంటారే.. 

కందిపోయే నీ కాళ్లెందుకయా

నంది వాహనం ఉందంటారే.. 

కందిపోయే నీ కాళ్లెందుకయా

మంచుకొండ నీ ఇల్లంటారే...

మంచుకొండ నీ ఇల్లంటారే... 

వొళ్ళంతా ఈ వేడెందుకయా

అన్నపూర్ణ నీ అండనుండగా...

అన్నపూర్ణ నీ అండనుండగా... 

ఆకలి బాధ నీకెందుకయా     


భవ హరణా...  శుభ చరణా.. 

నాగా భరణా.. గౌరీ రమణా

దిక్కేలేనీ దీనులపాలిట 

దిక్కై నిలిచిన దేవుడవయ్యా  

భవ హరణా...  శుభ చరణా.. 

నాగా భరణా.. గౌరీ రమణా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి