19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

తెలుసుకొనవె యువతి | Telusukonave Yuvathi | Song Lyrics | Missamma (1955)

తెలుసుకొనవె యువతి



చిత్రం:  మిస్సమ్మ (1955)

సంగీతం:  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత:  పింగళి నాగేంద్రరావు 

నేపధ్య గానం:  ఏ. ఎం. రాజా


పల్లవి:


ఆఆ... ఆఆ... ఆఆఆ...


తెలుసుకొనవె యువతి.. 

అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


యువకుల శాసించుటకే..

యువకుల శాసించుటకే 

యువతులవతరించిరని


తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


చరణం 1:


సాధింపులు బెదరింపులు.. 

ముడితలకిక కూడవనీ... ఆ...అ...

సాధింపులు బెదరింపులు 

ముడితలకిక కూడవనీ

హృదయమిచ్చి పుచ్చుకొనే..

హృదయమిచ్చి పుచ్చుకొనే.. 

చదువేదో నేర్పాలని


తెలుసుకొనవె యువతి.. 

అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


చరణం 2:


మూతి బిగింపులు అలకలు 

పాతపడిన విద్యలనీ ... ఆ... అ...

మూతి బిగింపులు అలకలు 

పాతపడిన విద్యలనీ

మగువలెపుడు మగవారిని

మగువలెపుడు మగవారిని 

చిరునవ్వుల గెలవాలని


తెలుసుకొనవె యువతి.. 

అలా నడుచుకొనవె యువతీ

తెలుసుకొనవె యువతి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి