2, సెప్టెంబర్ 2025, మంగళవారం

పిలిచే వారుంటే పలికేను నేను | Pilichevarunte Palikenu nenu | Song Lyrics | Kalyana Mantapam (1971)

పిలిచే వారుంటే పలికేను నేను



చిత్రం :  కళ్యాణ మంటపం (1971)

సంగీతం :  ఆదినారాయణరావు

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


పిలిచే వారుంటే.. పలికేను నేను

పిలిచే వారుంటే.. పలికేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను

కనుపాప అద్దాన కదిలేను నేను.. 

ఆ....ఆ.....ఆ....


పలికేవారుంటే.. పిలిచేను నేను

పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 1 :


ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము.. ఆ...ఆ... ఆ...

ఏ నాటిదో ఈ బంధము.. 

మన అనుబంధము

కలకాలము నిలవాలిలే.. 

మన అనురాగము

గోదారిలా నేడు ఉరికేను మనసు.. 


నీ పిలుపు వినగానే.. 

పులకించె బ్రతుకు 

పులకించె బ్రతుకు

పిలిచే వారుంటే.. పలికేను నేను 


హృదయాన ఉయ్యాల ఊగేవు నీవే

కనుపాప అద్దాన కదిలేది నీవే 

ఆ....ఆ.....ఆ....


చరణం 2 :


నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే ఆ....ఆ..ఆ.. 

నీ రూపమే నా దైవమై 

నను మురిపించెలే

నా అందమే అరవిందమై 

నిను పూజించెలే 

నీ మనసులో నాకు 

చోటుంటే చాలు

నా బ్రతుకులో విరియు 

నవనందనాలు.. నవనందనాలు


పలికేవారుంటే.. పిలిచేను నేను

హృదయాన ఉయ్యాల ఊగేను నేను...

కనుపాప అద్దాన కదిలేను నేను

ఆ....ఆ......ఆ......


చరణం 3 :


కలగన్నదే నిజమైనది 

చెలి ఔనన్నది

సొగసున్నదీ... గుణమున్నదీ 

చెలి నాదైనది 


అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము

అడుగుల్లో అడుగేసి నడవాలి మనము

మన మొకటి కాగానే మారాలి జగము 


మన మొకటి కాగానే మారాలి జగము

మారాలి జగము.. మారాలి జగము.. 

మారాలి జగము


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి